Take a fresh look at your lifestyle.

అధైర్య పడొద్దు అండగా ఉంటాం ఎమ్మెల్యే అనిల్ జాదవ్

బోథ్, ముద్ర:

ప్రమాదవశాత్తు జరిగిన అగ్ని ప్రమాదం కారణంగా పంట నష్టపోయిన బాధిత రైతులకు అండగా ఉంటామని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. బోథ్ మండలంలోని కనుగుట్ట గ్రామ శివారులో రెండు రోజుల క్రితం జరిగిన అగ్ని ప్రమాద కారణంగా 20 మంది రైతులకు చెందిన 80 ఎకరాలలో కోతకు వచ్చిన జొన్న, మొక్కజొన్న పంటలు కాలిపోయిన ఘటనపై ఎమ్మెల్యే దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన కాలిపోయిన పంట క్షేత్రాలను పరిశీలించారు. బాధిత రైతులతో మాట్లాడి భరోసా కల్పించారు. రైతులు ఎవరు అధైర్యా పడవద్దని ప్రభుత్వం నుండి నష్ట పరిహారం అందేలా కృషి చేస్తానని భరోసా కల్పించారు. ఈ ఘటనపై చీఫ్ సెక్రెటరీ, జిల్లా కలెక్టర్ లకు విన్నవించానని త్వరిత గతిన సర్వే జరిపి నష్ట పరిహారం ఇస్తామని వారు చెప్పినట్లు ఎమ్మెల్యే అన్నారు. ఈ ఘటనలో కోతకు వచ్చిన పంటతో పాటు పైపులు, ఇతర వ్యవసాయ సామగ్రి సైతం కాలిపోయాయని రైతులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యే వెంట బోథ్ మాజీ ఎంపీపీ తుల శ్రీనివాస్, బోథ్ మాజీ జడ్పీటీసీ సంధ్యారాణి తదితరులు కలరు.

Leave A Reply

Your email address will not be published.