విస్తృతంగా వివిధ ప్రాంతాలలో ఘనంగా కేక్ కటింగ్ లు సేవా కార్యక్రమాలు
నాఖా చౌరస్తా లో క్రేన్ సహాయంతో గజ మాలతో నరేందర్ రెడ్డి ని సన్మానించి అనంతరం కేక్ కట్ చేసి పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించారు
ముద్ర, కరీంనగర్ :

సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు కరీంనగర్ నియోజకవర్గంతో పాటు వివిధ ప్రాంతాల్లో ఘనంగా నిర్వహించబడ్డాయి. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని కేక్ కటింగ్‌లు, సేవా కార్యక్రమాలు నిర్వహించారు.నగరంలోని ఇందిరా చౌక్‌లో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకోగా, పలు ప్రాంతాల్లో వాకర్స్ అసోసియేషన్లు, డివిజన్ల నాయకులు, కార్యకర్తలు కూడా ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. భగత్‌నగర్‌లోని అయ్యప్ప గుడిలో హనుమాన్ దీక్ష స్వాములకు భిక్ష కార్యక్రమం నిర్వహించారు. అదేవిధంగా సివిల్ ఆసుపత్రి, వృద్ధాశ్రమం, మాతా-శిశు ఆసుపత్రుల్లో అల్పాహారం, పండ్ల పంపిణీ కార్యక్రమాలు చేపట్టారు. నాఖా చౌరస్తాలో క్రేన్ సహాయంతో నరేందర్ రెడ్డిని గజమాలతో సన్మానించి ఘనంగా సంబరాలు నిర్వహించారు.

కరీంనగర్ రూరల్ మండలం, కొత్తపల్లి మండలంలోని గ్రామాల్లో కూడా ఉపాధి హామీ మహిళలతో కలిసి సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేసి వేడుకలను నిర్వహించారు. మొత్తం నియోజకవర్గం వ్యాప్తంగా ఉత్సాహభరిత వాతావరణంలో జన్మదిన వేడుకలు కొనసాగాయి.

ఈ కార్యక్రమంలో పర్వతం మల్లేశం, బోట్ల శ్యామల కిరణ్, తాజద్దీన్,మడుపు మోహన్,కల్లేపల్లి బాలరాజు, ఖాదర్ షా,కొరివి అరుణ్ కుమార్, పెద్దిగారి తిరుపతి,కాంపెల్లి కీర్తి కుమార్,జక్కుల మల్లేశం, చాంద్, ఎట్టేపు వేణు, గుడిపాటి రమణ రెడ్డి, అస్తపురం రమేష్,పిట్టల రవి,షైనషా ,రంగా నాయక్,మీరజ్, ఆశ్రఫ్,చెర్ల పద్మ,యనమల మంజుల ,షబానా, ముల్కలా కవిత,అస్తపురం తిరుమల,మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

