Take a fresh look at your lifestyle.

విద్యార్థులు చదువులో పోటీతత్వాన్ని అలవర్చుకోవాలి

  • మాజీ ఎంపీటీసీ సభ్యులు గోవిందుల లావణ్య,జలపతి.

గొల్లపల్లి, ముద్ర: జగిత్యాల జిల్లాలోని గొల్లపల్లి మండలంలోని లక్ష్మీపూర్ గ్రామంలో మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలల్లో బుధవారం జరిగిన ఏడవ తరగతి విద్యార్థిని విద్యార్థుల వీడ్కోలు సమావేశ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గోవిందుల లావణ్య జలపతి పాల్గొన్నారు.ఒకటవ తరగతి నుండి ఏడవ తరగతి వరకు చదువులో ప్రతిభ కనబరిచిన విద్యార్థిని విద్యార్థులకు అభినందనలు తెలియజేసి వారికి బహుమతులు ప్రధానం చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. విద్యార్థులు చదువులో పోటీ తత్వాన్ని అలవరుచుకోవాలని. విద్యార్థులు ప్రాథమిక స్థాయిలో ఎంత శ్రద్ధగా చదివితే భవిష్యత్తు లో అంత గొప్ప గా ఎదుగుతారాని అన్నారు. మనిషి ఎదుగుదలలో విద్య కీలక భూమిక పోషిస్తుంది కావువ విద్యార్థినీ విద్యార్థులు భవిష్యత్తులో చదువులో గొప్ప గొప్ప విజయాలు సాధించాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు పూర్ణ చందర్, ఉపాద్యాయులు రమేష్, దుర్గదేవి,గాయత్రి, శ్రీలత,రుహిణ,నాయకులు బల్ జపెళ్లి గంగారెడ్డి,తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.