మాదాపూర్, ముద్ర విలేఖరి: శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని హల్ కాలనీ లో రూ.4 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నూతనంగా చేపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణం పనులకు కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని శంకుస్థాపన చేసిన పీయేసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ. ఈ సందర్భంగా చైర్మన్ గాంధీ మాట్లాడుతూ హల్ కాలనీ లో ఎన్నో ఏండ్ల సమస్య నేటి తో తిరినది అని, హల్ కాలనీ తో పాటు కె. ఎం. ఆర్ ఎస్టేట్, పారాఅమౌంట్ కాలనీల తో పాటు చుట్టుపక్కల కాలనీల వాసులకు ఎంతగానో ఉపయోగపడుతుంది అని ప్రజలకు సాంత్వన చేకూరింది అని, ప్రజల సంక్షేమం మరియు శేరిలింగంపల్లి నియోజకవర్గం మరియు కాలనీ ల అభివృద్దే ధ్యేయంగా ప్రజల సౌకర్యార్థం 4 కోట్ల రూపాయల అంచనాతో సీసీ రోడ్ పనులకు శంకుస్థాపన చేశామని చైర్మన్ గాంధీ అన్నారు. సంక్షేమం మరియు అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డి మార్గదర్శకం లో శేరిలింగంపల్లి నియోకజకర్గంను అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ఆదర్శవంతమైన, అగ్రగామి నియోజకవర్గంగా తీర్చిదితానని చైర్మన్ గాంధీ తెలియచేసారు. అదేవిధంగా మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తామని, సీసీ రోడ్లు వంటి అభివృద్ధి పనులను నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని ,నాణ్యత విషయంలో ఎక్కడ రాజి పడకూడదని, ప్రజలకు ట్రాఫిక్ రహిత, సుఖవంతమైన ,మెరుగైన రవాణా సౌకర్యం కొరకు శాయ శక్తుల కృషి చేస్తానని, అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని PAC చైర్మన్ గాంధీ గారు చెప్పడం జరిగినది. పనుల్లో జాప్యం లేకుండా త్వరిత గతిన పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని చైర్మన్ గాంధీ గారు అధికారులను ఆదేశించడం జరిగినది , ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కలిపిస్తామని ,ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా సుఖవంతమైన ప్రయాణానికి బాటలు వేస్తామని చైర్మన్ చెప్పారు.ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, కాలనీ వాసులు, కాలనీల అసోసియేషన్ సభ్యులు, మహిళలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

