రామకృష్ణాపూర్,ముద్ర విలేకరి : పట్టణంలోని ఎస్.ఆర్.కె పాఠశాలలో శుక్రవారం ట్రాఫిక్ నిబంధనలపై విద్యార్థులకు పట్టణ ఎస్సై జీ.రాజశేఖర్ అవగాహన కల్పించారు. మంచి మార్గంలో నడిచి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని విద్యార్థులకు సూచించారు. అనంతరం స్థానిక రాజీవ్ చౌక్ చౌరస్తాలో విద్యార్ధులతో (డ్రిల్) ట్రాఫిక్ విధులు చేయించారు.రెండో ఎస్సై లలిత,హెడ్ కానిస్టేబుల్ సత్తయ్య, కానిస్టేబుల్ శ్రీధర్, ప్రధానోపాధ్యాయుడు ఉప్పలయ్య ఉన్నారు.