సిద్దిపేట అభివృద్ధి పై అక్కసు పెట్టుకొని ఎట్లా అడుగు పెడతావు రేవంత్ రెడ్డి. సిద్దిపేటపై ఎందుకింత కక్ష రేవంత్ రెడ్డి. * సిద్దిపేట ఎమ్మెల్యే హరిశ్ రావు
ముద్ర ప్రతినిధి, సిద్దిపేట :
నువ్వు ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా సిద్దిపేటపై ఈర్షాద్వేషాలేనా అంటూ సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. ఈ నెల 22 న నంగునూర్ మండలం నర్మేట్ట లో ఏర్పాటు చేసిన ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ని ప్రారభించానున్న నేపథ్యంలో హరిశ్ రావు పలు ప్రశ్నలు సంధించారు. గత ప్రభుత్వ హయాంలో సిద్దిపేట అభివృద్ధి పనుల కోసం విడుదలైన 1,070 కోట్ల రూపాయల నిధులను ఎందుకు రద్దు చేశావన్నారు. ఆ నిధులను పునరుద్ధరించి సిద్దిపేట నియోజకవర్గంలో అడుగు పెట్టలని సూచించారు. కక్షపూరితంగా నువ్వు రద్దు చేసిన నిధుల గురించి.. ఆగిపోయిన పనుల గురించి మా సిద్దిపేట ప్రజలకు ఏం సమాధానం చెబుతావన్నారు.
సిద్దిపేట అభివృద్ధిపై ఆనాడు నువ్వు చేసిన విమర్శలను, నీ ఓర్వలేని తనాన్ని మా ప్రజలు మర్చిపోలేదన్నారు.మీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇక్కడ ఒక్క పనైనా చేశారా అని ప్రశ్నించారు.
నువ్వు ప్రారంభించేందుకు వస్తున్న పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ నిధులు కూడా మా బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో విడుదలైనవేనని గుర్తు చేశారు. మీరు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన 27 నెలల తర్వాత అధికారికంగా సిద్దిపేట నియోజకవర్గంలో అడుగుపెడుతున్నందుకు ఈ ప్రాంత ఎమ్మెల్యేగా స్వాగతిస్తున్నానని, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సిద్దిపేట పేరెత్తనిదే మీకు రోజు గడిచేది కాదని సిద్దిపేట అభివృద్ధిపై మీరు ప్రదర్శించిన ఈర్షాద్వేషాలను మా నియోజకవర్గ ప్రజలు కలకాలం గుర్తుంచుకుంటారని లేఖలో పేర్కొన్నారు.. ఆనాడు కలలో కూడా సిద్దిపేటను తలచిన మీరు ఈనాడు అధికారంలోకి రాగానే రాష్ట్రంలో సిద్దిపేట అనే నియోజకవర్గం ఒకటుందనే విషయాన్ని మరచిపోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సిద్దిపేట అభివృద్ధిని విస్మరించడమే గాకుండా బిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో మంజూరైన నిధులను పూర్తిగా రద్దు చేశారని, నిధులు రద్దు కావడంతో 27 నెలలుగా పనులు ఆగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వ పాలనలో సిద్దిపేట నియోజకవర్గంలోని అభివృద్ధి పనుల కోసం రూ.1070.73 (ఒక వెయ్యి డెబ్బై కోట్ల డెబ్బై మూడు లక్షల రూపాయలు) కేటాయింపు జరిగిందని . ఈ నిధులతో అభివృద్ధి పనులు చేపట్టి కొనసాగిస్తుండగా అర్ధాంతరంగా ఈ నిధులను మీరు రద్దు చేశారు. దీంతో పనులన్నీ ఆగిపోయాయన్నారు. చేసిన పనులకు కూడా నిధులు మంజూరు చేయకపోవడం దుర్మార్గమన్నారు. ఈ పనులన్నీ జరిగితే సిద్దిపేట భవిష్యత్తు మరోలా ఉండేది. సిద్దిపేట ప్రగతిపై కక్షపూరితంగా వ్యవహరించకుండా వెంటనే మీరు రద్దు చేసిన నిధులను పునరుద్దరించాలన్నారు.అర్ధాంతరంగా ఆగిన పనులు జరిగేలా చర్యలు తీసుకొని మీ గౌరవాన్ని కాపాడుకోండిన్నారు.సిద్దిపేట కు వస్తున్న మీకు మీరు రద్దు చేసిన ఆగిన పనుల వివరాలు అంటూ లేఖలో తెలియజేశారు.

– ప్రభుత్వ వెటర్నరీ కళాశాల
– రంగనాయకసాగర్ టూరిజం
– కోమటిచెరువు శిల్పారామం
– సిద్దిపేట నియోజకవర్గ ఔటర్ రింగు రోడ్డు
– తోర్నాలలో బిఎస్సీ అగ్రికల్చర్ కళాశాల
– మిట్టపల్లిలో ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల భవనం
– సిద్దిపేటలో క్రీడాకారుల కోసం స్పొర్ట్స్ హబ్
– టు టౌన్ పోలీస్‌స్టేషన్ భవనం
– త్రీ టౌన్ పోలీస్‌స్టేషన్ భవనం
– సిద్దిపేట– ఇల్లంతకుంట ఫోర్‌లేన్ రోడ్డు
– సిద్దిపేట– కిష్టాపూర్ రహదారి
– సిద్దిపేటలో మల్టీపర్పస్ ఆడిటోరియం
– సిద్దిపేట బ్లాక్‌ఆఫీస్ సమీపంలో ఇంటిగ్రేటెడ్ వెజ్ మరియు నాన్ వెజ్ మార్కెట్ లకు నిధులు విడుదల చేయాలన్నారు.