Take a fresh look at your lifestyle.

పిప్పిరిలో ముఖ్యమంత్రి భారీ బహిరంగ సభ

బోథ్, ముద్ర: పీపుల్స్ మార్చ్ పాదయాత్రకు మూడేళ్లు పూర్తి తో పాటు 99 రోజుల ప్రజా పాలన ఉత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 6 న ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గంలోని పిప్పిరి గ్రామంలో ముఖ్యమంత్రి భారీ బహిరంగ సభ ఉంటుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు లు శనివారం తెలిపారు. ముఖ్యమంత్రి బహిరంగ సభ ఏర్పాట్లపై ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్లు, రాష్ట్ర ఉన్నత అధికారులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శనివారం హైదారాబాద్ లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు మాట ఇస్తే అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా నెరవేరుస్తుందని అన్నారు.
ఈ బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా పీపుల్స్ మార్చ్ పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేసే పత్రాలను ప్రజలకు అందిస్తామని తెలిపారు. అధికారులు సమన్వయం చేసుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభకు కావలసిన అన్ని ఏర్పాట్లు చేయాలని దిశా నిర్దేశం చేశారు. ఈ సమావేశంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి సుదర్శన్ రెడ్డి ఎమ్మెల్యేలు ప్రేమ్ సాగర్ రావు వెడమ బొజ్జు ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా కలెక్టర్లు రాష్ట్ర ఉన్నత అధికారులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.