Take a fresh look at your lifestyle.

భేషా జాలాలు లేకుండా అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నాం-రాష్ట్ర పరిశ్రమల మంత్రి ద్దుద్ధిల్లా శ్రీధర్ బాబు

 

* సిద్దిపేట లో హరిశ్ రావు ఉన్న ఇక్కడ పరిశ్రమలు స్థాపిస్తున్నాం
* స్థానిక నాయకులూ, ప్రజలు సహకరించాలి
* డిసెంబర్ లోపు ప్రాజెక్ట్ పూర్తి కావాలి
* యువతకు ఉపాధి దొరకాలి

 

ముద్ర ప్రతినిధి, సిద్దిపేట :

సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మేట గ్రామంలో 20 ఎకరాల్లో రూ.210 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయనున్న బయోగ్యాస్ ప్లాంట్ నిర్మాణానికి మంత్రి శ్రీధర్ బాబు భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్బంగా
మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ
పరిశ్రమలు హైదరాబాద్‌కే పరిమితం కాకుండా ఇతర ప్రాంతాలకు విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు.
నర్మేట ప్రాంతంలోని వనరులపై పలు సార్లు చర్చలు జరిపి ఈ పరిశ్రమకు రూపకల్పన చేశామని తెలిపారు.బయో ఫ్యూయల్స్ ప్రాముఖ్యత పెరుగుతోందని, గడ్డి వంటి వనరులతో ఇంధనం తయారు చేయవచ్చని వివరించారు.
పరిశ్రమల ద్వారా యువతకు ఉపాధి కలిగి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని అన్నారు. 2047 నాటికి తెలంగాణను ట్రిలియన్ ఎకానమీగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో పరిశ్రమలు వస్తే యువతకు ఉద్యోగావకాశాలు పెరుగుతాయన్నారు.
కాలుష్యం లేని పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ప్రస్తుతం దేశం 90% వరకు ఇంధనాన్ని దిగుమతి చేసుకుంటోందని, ఇందులో 65% వంట గ్యాస్ ఇతర దేశాలపై ఆధారపడుతోందని చెప్పారు.
అంతర్జాతీయ పరిస్థితులు, యుద్ధాల ప్రభావం వల్ల LPG సరఫరాపై కూడా ప్రభావం పడుతోందని సూచించారు.
“Make in India” తరహాలో “Make in Telangana” లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. నర్మేట లో ఏర్పాటు చేస్తున్న ఫ్యాక్టరీ లో డిసెంబర్ లోపు ఉత్పత్తి కావాలఅన్నారు.ఇక్కడి ఫలితాలు అనుభవించాలని సూచించారు. హరీశ్ రావు ప్రాంతం అయినా పరిశ్రమ తెచ్చామని తమకు ఎలాంటి బెషా జాలాలు లేవని . అన్ని ప్రాంతాలు బాగూబపాడాలనేది సీఎం సంకల్పం అన్నారు…

కాళేశ్వరం ప్రోజెక్ట్ వల్లే సిద్దిపేట కు పరిశ్రమలు……

సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు మాట్లాడుతూ ఇలాంటి పరిశ్రమ సిద్దిపేటకు రావడం ఆనందంగా ఉందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు.. పరిశ్రమల అభివృద్ధి కోసం ఇప్పటికే 2014-15 సంవత్సరాల్లో భూ సేకరణ చేపట్టామని చెప్పారు.


కాళేశ్వరం ప్రాజెక్ట్ వల్ల ఈ ప్రాంతం అభివృద్ధి చెందిందని, నీటి లభ్యత పెరగడంతో పరిశ్రమలు స్థాపనకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయని పేర్కొన్నారు. ఆయిల్ ఫెడ్ వంటి పరిశ్రమలను ప్రారంభించామని, మరిన్ని ఇండస్ట్రీలు రావడానికి ఇదే కారణమని తెలిపారు.
ఇంతకుముందు నీటి కొరత కారణంగా వరి పంటలు పండించలేకపోయేవారని, ఇప్పుడు పరిస్థితి మారిందన్నారు. రైతులకు ధాన్యంతో పాటు గడ్డి (fodder) ద్వారా కూడా ఆదాయం వస్తోందని చెప్పారు.
బయో గ్యాస్ ప్లాంట్ల అభివృద్ధి ద్వారా సుమారు 500 మందికి ఉపాధి కలుగుతోందని, రైతులకు కూడా అదనపు ఉపాధి అవకాశాలు ఏర్పడుతున్నాయని వెల్లడించారు.
ప్రజలందరూ సహకరించాలని, రాజకీయాలకు అతీతంగా మరిన్ని పరిశ్రమలు తీసుకురావడానికి ప్రయత్నించాలన్నారు. ప్రజలు మంచిగా ఉంటేనే పరిశ్రమలు వస్తాయని అన్నారు.
అంతర్జాతీయ పరిస్థితులపై కూడా స్పందించిన హరీష్ రావు, అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతున్నాయని చెప్పారు. ప్రస్తుతం భారత్ సుమారు 50% గ్యాస్‌ను దిగుమతి చేసుకుంటోందని, యుద్ధ పరిస్థితుల వల్ల గ్యాస్ కొరత ఏర్పడే అవకాశం ఉందన్నారు.
ఇలాంటి బయో గ్యాస్ ప్లాంట్ల వల్ల ఆ సమస్యలను తగ్గించుకోవచ్చని, దిగుమతులను తగ్గించి స్వయం సమృద్ధి సాధించవచ్చని మాజీ మంత్రి తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.