Take a fresh look at your lifestyle.

పేదల కల ఇందిరమ్మ ఇల్లు – ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి

ముద్ర, ఉమ్మడి
మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి :
………………………………………..
ఇందిరమ్మ ఇండ్ల తో పేదల సొంతింటి కల సాకారమవుతున్నదని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంగళవారం మహబూబ్ నగర్ నియోజకవర్గ పరిధిలోని హన్వాడ,కొత్తపేట గ్రామాల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత పదేళ్ల కాలం లో బిఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇండ్ల పేరుతో పేదలను మోసం చేసిందన్నారు.కానీ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల కోసం సంక్షేమాన్ని అమలు చేస్తోందని, సొంత ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి పక్కా ఇల్లు కల్పించడమే మా ప్రభుత్వ లక్ష్యమ న్నారు. ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా నిరుపేదలు ఎన్నో సంవత్సరాల కల నేడు నిజమవుతోందని, నేటికీ ఏ గ్రామాన్ని చూసినా నాడు ఇందిరా గాంధీ ఇచ్చిన లక్షలాది ఇందిరమ్మ ఇండ్లు ప్రజలకు ఆశ్రయం కల్పించాయన్నారు. అర్హులైన లబ్ధిదారులను పూర్తిస్థాయి పారదర్శకతతో ఎంపిక చేసి, మధ్యవర్తిత్వం లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో ఇందిరమ్మ ఇళ్ల డబ్బు జమ చేస్తున్నామని స్పష్టం చేశారు. గూడు లేని కుటుంబాలకు భద్రత, ఆత్మవిశ్వాసం, గౌరవాన్ని అందించడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశమని, ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు నిర్మించే వరకు కృషి ఆగదని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బుద్ధరాం సుధాకర్ రెడ్డి ,హన్వాడ మండల పార్టీ అధ్యక్షులు మహేందర్ ,సర్పంచ్ ఇస్నత్ సుధాకర్ ,గ్రామ కమిటీ అధ్యక్షుకు శ్రీనివాస్ ,ఉప సర్పంచ్ రాములు ,మైనారిటీ అధ్యక్షులు షబ్బీర్ హుసేన్ ,యాది రెడ్డి ,బొక్కి రాములు,శేఖర్ గౌడ్ ,కృష్ణయ్య గౌడ్ , కార్పొరేటర్ ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.
……………………………
కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణి :


………………………………….
ఆడపిల్లల వివాహానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మహబూబ్ నగర్ గ్రామీణ మండలాలకు చెందిన అర్హులైన లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులను ఆయన పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పేద కుటుంబాల్లో పుట్టిన ఆడబిడ్డల భవిష్యత్తు కోసం ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా నిలుస్తోందని, ఆడబిడ్డలకు ప్రతి రంగంలో భరోసా కల్పిస్తున్నామని ఆయన పేర్కొన్నారు . ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు వివాహ సమయంలో భారం తగ్గించేందుకు ఈ పథకాన్ని ప్రభుత్వం సమర్థంగా అమలు చేస్తున్నదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళల అభివృద్ధి, సాధికారత కోసం వారి పేరుతోనే అనేక సంక్షేమ కార్యక్రమాలు పథకాలు ప్రవేశపెట్టామని ఆయన గుర్తు చేశారు.

Leave A Reply

Your email address will not be published.