Take a fresh look at your lifestyle.

సిద్దిపేట లో గంగ జెమునా తహజీబ్ కొనసాగుతుంది – తంజిమ్ సుప్రీం బాడీ సభ్యులు అబ్దుల్ ఖాదర్

 

ముద్ర ప్రతినిధి,సిద్దిపేట :

సిద్దిపేట లో హిందూ ముస్లిం ల ఐక్యత తో ఎల్లప్పుడూ గంగ జెమునా తహజీబ్ కొనసాగుతుందని సిద్దిపేట తంజిమ్ సుప్రీం బాడీ సభ్యులు, సిద్దిపేట హజ్ సొసైటీ అధ్యక్షుడు మంజూర్ అన్నారు. ముస్లిం సోదరులు చేసుకునే రంజాన్, బక్రీద్ పండుగల సమయంలో సిద్దిపేట కు చెందిన మాజీ కౌన్సిలర్ సురేందర్ రెడ్డి త్రాగు నీటిని ఏర్పాటు చేస్తోంటారు. ఈ సందర్బంగా అయన చేస్తున్న సేవలను గుర్తించిన హజ్ సొసైటీ ఆదివారం సిద్దిపేట హజ్ హౌస్ లో ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా సిద్దిపేట సేవలు చేయడం అభినందనీయం అన్నారు. అందరు కలిస్తేనే దేశ అభివృద్ధి తో పాటు శాంతి సమాజం నెలకోల్పోచ్చని తెలిపారు. తన సేవలను గుర్తించి సన్మానించినందుకు సురేందర్ రెడ్డి హజ్ సొసైటీ కి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో హజ్ సొసైటీ సభ్యులు కాలిముద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.