ముద్ర కూకట్‌పల్లి :
రానున్న పదో తరగతి వార్షిక పరీక్షలను పురస్కరించుకుని యువ ఫర్ తెలంగాణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఎగ్జామ్ కిట్ల పంపిణీ జరిగింది. ఎల్లమ్మబండ ప్రభుత్వ పాఠశాలలో డివిజన్ మాజీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్, శంషిగూడ ప్రభుత్వ పాఠశాలలో యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరై విద్యార్థులకు ఎగ్జామ్ పాడ్స్ మరియు జామెట్రీ బాక్సులను అందజేశారు.
ఈ సందర్భంగా వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ, విద్యార్థులందరూ క్రమశిక్షణతో చదివి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని, తద్వారా తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా నాణ్యమైన విద్యను అందిస్తున్న ప్రభుత్వానికి, ఉపాధ్యాయులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థుల అవసరాలను గుర్తించి కిట్లను అందజేసిన ఫౌండేషన్ సభ్యులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.
ఈ కార్యక్రమంలో నాయకులు గోపాల్, గుడ్ల శ్రీనివాస్, భాస్కర్, షౌకత్ అలీ మున్నా, పోశెట్టిగౌడ్, ఖలీమ్ పాల్గొన్నారు. అలాగే యువ ఫర్ తెలంగాణ స్టేట్ కన్వినర్ గవ్వల భరత్ కుమార్, BCSF నేషనల్ సెక్రటరీ & హైదరాబాద్ కన్వినర్ రుద్ర అభిరామ్ గౌడ్, ‘Save the Earth From AtoZ We Are One’ వరల్డ్ మిషన్ సొసైటీ సభ్యులు, పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.