Take a fresh look at your lifestyle.

అంగరంగ వైభవంగా శ్రీస్వామి వారి నిత్య కళ్యాణోత్సవం

ముద్ర, ప్రతినిధి భువనగిరి :
కలియుగ ప్రత్యక్ష దైవమైన స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి నిత్య కళ్యాణోత్సవం మంగళవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు.
ఆలయంలో ఉదయం సుప్రభాత సేవతో మొదలుకొని నిత్య కైంకర్యాలు జరిగాయి.
స్వర్ణగిరి దివ్య క్షేత్రంలో అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి అన్న ప్రసాద వితరణలో భాగంగా మంగళవారం సుమారు 3000 మందికి పైగా భక్తులు నిత్యాన్న ప్రసాదాన్ని స్వీకరించారు.
సాయంత్రం తిరువీధి ఉత్సవ సేవను ఘనంగా నిర్వహించారు.

Leave A Reply

Your email address will not be published.