ఘనంగా కాంగ్రెస్ నాయకులు ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలు పాల్గొన్న ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి
తాండూరు, ముద్ర :
తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి సోదరుడు కాంగ్రెస్ నాయకులు
ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి.పట్టణంలోని శ్రీనివాస్ రెడ్డి నివాసంలో ఆయన జన్మదిన వేడుకలు జరిగాయి. ఈ వేడుకలకు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి హాజరయ్యారు. జన్మదినం సందర్భంగా తమ్ముడు శ్రీనివాస్ రెడ్డిని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి శాలువా, పూలమాలతో సత్కరించారు. దగ్గరుండి కేక్ కట్ చేయించారు.
కేక్ తినిపించి జన్మదిన శుభాకంక్షాలు తెలిపారు.ఈ జన్మదినోత్సవ వేడుకల్లో
అన్నదమ్ముల అనుబంధం వెల్లివిరిసింది.
తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, ఆయన సోదరులు ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి, సత్యనారాయణ రెడ్డిల ఆత్మీయ కలయిక అందరిలో సంతోషాన్ని నింపింది
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డితో పాటు శ్రీనివాస్ రెడ్డి, మరో సోదరుడు సత్యానారయణరెడ్డిలు ముగ్గురు కలిసి ఆలింగం చేసుకుని అనుబంధాన్ని చాటుకున్నారు. ఈ దృశ్యాలతో నేతలు, అభిమానులు, కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేశారు.