దేశంలోనే తెలంగాణ అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిపోయిందని తెలంగాణ మాజీ శాసనసభ అధిపతి శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనా చారి అన్నారు. శనివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా పరకాల లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో స్థానిక మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తో కలిసి మాట్లాడారు. తెలంగాణ కంటే వందల ఏళ్లు ముందుగా ఏర్పడిన రాష్ట్రాలు తెలంగాణ మోడల్ అభివృద్ధి చెందలేదని ఆయన తెలిపారు. తెలంగాణలోని ప్రతి ఇంటికి ప్రతి వ్యక్తికి గత ప్రభుత్వ హయాంలో లబ్ధి చేకూరిందని ఆయన అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత అభివృద్ధిని మేధావులు యువకులు అంచనా వేయాలన్నారు. తెలంగాణలోని మౌలిక వసతుల్లో ఎంతో మెరుగు దల కనిపించిందని మధుసూదనాచారి తెలిపారు. నిధులు నీళ్లు నియామకాల అంశాన్ని ఆధారంగా చేసుకొని అప్పటి కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకులు తెలంగాణ ఉద్యమాన్ని అవమానాల పాలు చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఎన్నికలలో తెలంగాణ వ్యాప్తంగా జరిగే మున్సిపాలిటీ ఫలితాలు అధికార కాంగ్రెస్ పార్టీకి చెంపపెట్టుల మిగులుతాయి అన్నారు. ద్రోహం మోసం అసమర్థతకు ఇప్పటి ప్రభుత్వం ఉదాహరణగా మిగులుతుందని మధుసూదనాచారి ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ పనిచేసిన విధానానికి నీటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన విధానానికి పోలికలతో చూస్తూ ప్రజలు ఎన్నికల్లో తీర్పు ఇవ్వటం ఖాయమని ఆయన అన్నారు.
కాంగ్రెస్ మాయలు పడొద్దు.
ఈ ఎన్నికలలో కాంగ్రెస్ మహిళా పడద్దని పరకాల పట్టణ ప్రజలను పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లధ ధర్మారెడ్డి కోరారు. రెండు సంవత్సరాల క్రితం జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ మాయలో పడి టీఆర్ఎస్ ను ఓడించడం జరిగిందని ప్రజలు భావిస్తున్నారని ఆయన అన్నారు. 26 నెలల కాలంలో స్థానిక ఎమ్మెల్యే ఒక్క పైసా రాష్ట్ర ప్రభుత్వం నుండి తేలేదని ధర్మారెడ్డి తీవ్రంగా విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో తను తెచ్చిన నిధులను ఇప్పటికీ ఖర్చు చేయడం ఎలాగో తెలవక ఆయన ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. పరకాల మున్సిపాలిటీపై బిఆర్ఎస్ జెండా ఎగురుతుంది అన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు. పరకాల మున్సిపాలిటీ ఎన్నికలలో భాగంగా ఈనెల తొమ్మిదిన టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ పరకాల కు వస్తున్నట్లు ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు అధిక సంఖ్యలో రావాలని అన్నారు. కేటీఆర్ కార్యక్రమం బస్టాండ్ సమీప నుండి పట్టణంలోని ప్రధాన వీధిలో ఉంటుందా అన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు మున్సిపల్ ఎన్నికలలో పోటీపడుతున్న అభ్యర్థులు పాల్గొన్నారు.