Take a fresh look at your lifestyle.

ప్రభుత్వం జారీ చేసిన జి.వో నెం.282 ను రద్దు చేయాలి

  • ఐఎఫ్టియు డిమాండ్.

ముద్ర ప్రతినిధి,గోదావరిఖని: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన పని గంటల పెంపు జి.వో నెం.282 ను వెనక్కితీసుకోవాలని గోదావరి లోయ బొగ్గు గని కార్మిక సంఘం ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షులు కే విశ్వనాథ్ డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దుకాణాలు, స్థాపనల చట్టం,1988 లోని సెక్షన్ 16,17 కి సవరణ చేస్తూ 8 గం;ల పని దినాన్ని 10 గం;లకు పెంచుతూ జులై 5న జి.వో.282 విడుదల చేసి,10 గం॥ల పని దినాన్ని చట్టబద్దం చేసింది.ఈ జి.వో పెట్టుబడిదారులు,కార్పోరేట్ల సంస్థల ప్రయోజనాలు,లాభాల కోసమే ఉద్దేశించబడింది.ఈ జీ.వో అమలయితే కార్మికులు తీవ్ర శ్రమ దోపిడికి గురవుతారనీ అన్నారు. ఈ జీ.వోలో కార్మికుల రోజువారి పని గంటలను 8 గం;ల నుండి 10గం;లకు పెంచింది.వారంలో 48 గం;ల పని దినం మించరాదని పేర్కొన్నది.అదే సందర్భంలో ఓవర్ టైం ప్రతి మూడు నెలలకు 144 గంటలు మించకుండా ఉండాలని తెలిపింది.ఈ జి.వో పల్ల సులభతర వ్యాపారంకు దోహదపడుతున్నది ప్రభుత్వం చెబుతున్నది.ఇది పెట్టుబడిదారు లకు,కార్పొరేట్లకు వారి లాభాలను పెంచడానికి దోహదపడుతున్నది తప్ప కార్మికులకు ఎలాంటి ప్రయోజనం చేకుర్చదనీ అన్నారు. కార్మిక రంగంలో సంస్కరణలు అమలు పేరుతో కేంద్ర బిజెపి ప్రభుత్వం ఇప్పటికే 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్సు అమలు చేసేందుకు ఊవ్విళ్ళురితున్న సందర్భంలో ఆ లేబర్ కోడ్లో ప్రతిపాధించిన 10 గంటల పని దినాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం జి.వో.282 రూపంలో ముందుకుతీసుకరావడం దుర్మార్గం అని ఆవేదన వ్యక్తం చేశారు.జులై 9 దేశ వ్యాపిత సమ్మె కు సన్నద్ధం అవుతన్న తరుణంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కార్మికులను మరింత రెచ్చగొట్టే విధంగా తెలంగాణా రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం జీ.వో నెం.282 తీసుకు వచ్చి 8 గంటల పని 10 గంటలకు పెంచడం సరైంది కాదని వెంటనే జీ.వో నెం.282 ను వెనక్కి తీసుకుని రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేని పక్షంలో అన్ని కార్మికసంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఐ ఎఫ్ టి యు నాయకులు డి లచ్చన్న,సిహెచ్ ఐలయ్య,రాజన్న, రామ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.