Take a fresh look at your lifestyle.

రామగుండం లారీ యజమానుల సంఘం అధ్యక్షుడిగా మళ్లీ కుందూరు శ్రీనివాస్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, గోదావరిఖని: రామగుండం ఏరియా లైన్ లారీ యజమానుల సంక్షేమ సంఘం కార్యవర్గ సభ్యులు ఇటీవల రాజీనామా చేయడంతో మళ్లీ కార్యవర్గం ఎన్నిక అనివార్యమైంది.నూతన అధ్యక్షుడిగా మళ్లీ కుందూరు శ్రీనివాస్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.గత ఐదు రోజులుగాజరుగుతున్న పరిణామాల వల్ల మనస్థాపానికి గురై అధ్యక్షులు కుందూరు శ్రీనివాస్ రెడ్డి రాజీనామా చేశారు.సంఘ సభ్యుల కోరిక మేరకు కుందూరు శ్రీనివాస్ రెడ్డి ని తిరిగి అధ్యక్షులుగా ఏకగ్రీవంగా రామగుండం ఏరియా లైన్ లారీ యజమానుల సంక్షేమ సంఘం సభ్యులు అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి ని ఎన్నుకున్నారు. ఈ మేరకు రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ రామగుండం లారీ యజమానుల సంఘం అధ్యక్షుడిగా ఎన్నికైన శ్రీనివాస్ రెడ్డిని పూలమాల వేసి అభినందించారు.

Leave A Reply

Your email address will not be published.