Take a fresh look at your lifestyle.

రైల్వే గేట్ ఫ్రీ మల్కాజిగిరి చేయండి -మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి

 

ముద్ర : మల్కాజిగిరి

మల్కాజిగిరి నియోజకవర్గాన్ని రైల్వే గేట్ల సమస్యల నుండి విముక్తి చేసి “రైల్వే గేట్ ఫ్రీ మల్కాజిగిరి”గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి సోమవారం సికింద్రాబాద్‌లోని రైల్వే నిలయంలో సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ శ్రీ సంజయ్ కుమార్ శ్రీవాత్సవ ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై వినతిపత్రాలు అందజేసి సమగ్రంగా చర్చించారు.
మల్కాజిగిరి నియోజకవర్గంలో రైల్వే లెవెల్ క్రాసింగ్‌ల కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించిన ఎమ్మెల్యే , సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం తక్షణమే చర్యలు చేపట్టాలని కోరారు.
మల్కాజిగిరి నియోజకవర్గంలోని రైల్వే లెవెల్ క్రాసింగ్‌ల వద్ద ఆర్ యు బీ లు నిర్మించాలని,మచ్చ బొల్లారం డివిజన్‌లోని రైల్వే బజార్ రైల్వే స్టేషన్ సమీపంలో రైల్వే టన్నెల్ నిర్మాణం చేపట్టాలని,మల్కాజ్‌గిరి రైల్వే స్టేషన్ పరిసరాల్లో వర్షపు నీరు, డ్రైనేజీ నీరు రోడ్లపైకి రావడం వల్ల ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులను నివారించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని,ఆర్‌కే పురం రైల్వే స్టేషన్ సమీపంలోని రైల్వే గేట్ వద్ద పాదాచారులు మరియు ప్రయాణికులు సురక్షితంగా వెళ్లేందుకు ప్రత్యేక మార్గం ఏర్పాటు చేయాలని కోరారు.ఈ అంశాలపై స్పందించిన సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాత్సవ సానుకూలంగా స్పందించి, త్వరలో సంబంధిత శాఖలతో జాయింట్ ఇన్స్పెక్షన్ నిర్వహించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో రైల్వే అధికారులు కిరణ్, శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి, బిఆర్ఎస్ నాయకులు మేకల రాము యాదవ్, డోలి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.