* 26 వేల మంది ఆర్టిజెన్స్ కు కెసిఆర్ జీతాలు పెంచారు.
* వారి న్యాయమైన డిమాండ్స్ నెరవేర్చాలి
* అవసరం అయితే ఆర్టిజెన్స్ తో కలసి బి ఆర్ ఎస్ ఉద్యమం చేపడుతుంది
ముద్ర ప్రతినిధి, సిద్దిపేట :
సమ్మె చేస్తున్న ఆర్టిజెన్స్ ని పిలిచి ప్రభుత్వం చర్చించాలని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు డిమాండ్ చేశారు. సిద్దిపేట ముస్తాబాద్ చౌరస్తా విద్యుత్ డివిజన్ కార్యాలయం వద్ద తెలంగాణ విద్యుత్ ఆర్టిసన్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో జరుగుతున్న సమ్మెకి సంఘీభావం తెలిపి మాట్లాడారు రాష్ట్రంలోని వర్గాలకు హామీలు ఇచ్చి రెండున్నర ఏం లో అయినా కూడా హామీలు నెరవేర్చడం లేదని మండిపడ్డారు. 26 వేల మందికి ఆర్డినెస్ గుర్తించి కెసిఆర్ వేతనాలు పెంచారని గుర్తు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు ఆర్టిసన్స్ ఎంప్లాయిస్ ను ప్రభుత్వ ఉద్యోగుల గుర్తిస్తామన్నారూ.
అంగన్వాడికి 18వేలు ఇచ్చి రిటైర్మెంట్ అయితే రెండు లక్షలు ఇస్తామన్నారు అడుగుతే పోలీసులతో దాడి చేస్తున్నారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు చేస్తున్న ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదని ఇది ప్రజా పాలన కాదు రాక్షస పాలన రాష్ట్రంలో కొనసాగుతుందన్నారు.బట్టి విక్రమార్క పాదయాత్రలో పెద్ద పెద్ద హామీలు ఇచ్చారు కానీ ఇప్పుడు ఒక్కటే నెరవేర్చడం లేదన్నారు. బట్టి విక్రమార్క ప్రజాభవన్ లోకి వెళ్ళగానే మారిపోయారన్నారు.
అండర్ గ్రౌండ్ పనులతో కమిషన్లు కొట్టే పనిని ప్రభుత్వం చేస్తుందని అప్పులు తెచ్చి కమిషన్లు కొట్టడం మీద ఉన్న ప్రేమ ప్రజల మీద లేదన్నారు.

కేసీఆర్ ఉన్నప్పుడు బిస్కెట్ల మాదిరిగా ట్రాన్స్ఫర్ ఇచ్చారు
24 గంటలు కరెంటు చెప్పిన 12 గంటలు కూడా సరిగా కరెంటు రావడం లేదని మండిపడ్డారు
ముఖ్యమంత్రి వెంటనే ఆర్టిజెన్స్ ఎంప్లాయిస్ చర్చకు పిలవాలి- హైకోర్టులో స్టే వచ్చిన ఆర్టిసన్స్ ఎంప్లాయిస్ కు జీతం పెంచారు కేసీఆర్ ఇచ్చిన మాట నిలబెట్ట కుంటే ఆర్టిసన్స్ తోపాటు బి ఆర్ ఎస్ పార్టీ ప్రత్యక్ష పోరాటం చేస్తాంమన్నారు. బి ఆర్ ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమం మరింత ఉదృతం చేస్తామని హేచ్చరించారు.