Take a fresh look at your lifestyle.

మాదిగలకు 11% రిజర్వేషన్ల డిమాండ్ -ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు లింగంపల్లి శ్రీనివాస్

 

ముద్ర ప్రతినిధి,సిద్దిపేట:

మాదిగలకు 11% రిజర్వేషన్ కల్పించాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు లింగంపల్లి శ్రీనివాస్ డిమాండ్ చేశారు.
సిద్ధిపేటలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్ లో జరిగిన సమావేశంలో నాయకులు మాట్లాడారు. ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు లింగంపల్లి శ్రీనివాస్, జిల్లా అధ్యక్షులు ముక్కపల్లి రాజు లు మాట్లాడుతూ
మాదిగల జనాభా శాతానికి అనుగుణంగా 10 నుంచి 11 శాతం రిజర్వేషన్లు కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కుల గణన నివేదికలో మాదిగల జనాభా సుమారు 10.3 శాతంగా తేలిందని, అందువల్ల ఎస్సీ వర్గీకరణలో అదే మేరకు వాటా ఇవ్వాలని తెలిపారు.
గతంలో తక్కువ శాతం రిజర్వేషన్లను అంగీకరించడం వల్ల మాదిగలకు అన్యాయం జరిగిందని పేర్కొన్నారు. ఇప్పుడు వెలువడిన కుల గణన నివేదికతో తమ వాదన నిజమైందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ అంశంపై తిరిగి ఆలోచించి న్యాయం చేయాలని కోరారు.
రాష్ట్రంలో మాదిగలు జనాభాలోనే కాకుండా దినసరి కూలీలు, భూమిలేని నిరుపేదలలో కూడా అధికంగా ఉన్నారని, ఇది వారి సామాజిక వెనుకబాటుతనాన్ని సూచిస్తుందని తెలిపారు. వారి అభివృద్ధికి ప్రత్యేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలని, భూములు కేటాయించాలని డిమాండ్ చేశారు.
అలాగే అన్ని ప్రభుత్వ నియామకాల్లో మాదిగలకు 11 శాతం వాటా ఇవ్వాలని కోరారు. శాసన మండలి, లోక్‌సభ, రాజ్యసభ వంటి స్థానాల్లో మాదిగలకు సరైన ప్రాతినిధ్యం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
మాదిగలు ఐక్యంగా ఉండి తమ హక్కుల కోసం పోరాడాలని నాయకులు పిలుపునిచ్చారు. ఎమ్మార్పీఎస్ నాయకుడు మంద కృష్ణ మాదిగ చేసిన పోరాటం వల్లే ఈ అంశం ముందుకు వచ్చిందని తెలిపారు.
ఇటీవల కేంద్ర ప్రభుత్వం జ్యోతిరావు ఫూలే ద్విశత జయంతి ఉత్సవాల కోసం ఏర్పాటు చేసిన కమిటీలో మంద కృష్ణ మాదిగను సభ్యుడిగా చేర్చినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు:
పెర్క పర్షరాములు, దండు శంకర్, సామ్రాట్ ప్రకాష్, చుంచు రమేష్, జేరిపోతుల లక్ష్మణ్ మాదిగ, బింగి పవన్ కళ్యాణ్, బింగి నవీన్, ఎల్లయ్య, దండు కనుకయ్య, గుండుకాడి బాబు, చింతమడక పర్షరాములు, పొన్నాల కనుకయ్య, బింగి బాలకిషన్, బొత్త దుర్గయ్య, దాకాని కనకరాజు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.