ముద్ర ప్రతినిధి కల్వకుర్తి: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రేషన్ బియ్యాన్ని మూడు నెలలకు సరిపడా ఒకేసారి ఇస్తున్న తరుణంలో కొంతమంది రేషన్ డీలర్లు సమయపాలన పాటించకుండా ప్రజలను ఇబ్బందిలకు గురి చేస్తున్నారని డీలర్లు సమయపాలన పాటించే విధంగా చూడాలని కల్వకుర్తి పట్టణ బిజెపి అధ్యక్షుడు గన్నోజు బాబిదేవ్ ఆధ్వర్యంలో శనివారం కల్వకుర్తి ఆర్డీవో శ్రీను కు వినతి పత్రం అందజేశారు. రేషన్ బియ్యం ఇచ్చినప్పుడు లబ్ధిదారులకు రసీదులు ఇవ్వట్లేదని చివరి లబ్ధిదారుడు వరకు రేషన్ బియ్యం అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. షాప్ లో బియ్యం అందుబాటులో ఉంచాలని తూకంలో అవకతవకలు జరగకుండా చూడాలని ఈనెల 30వ తేదీ చివరి రోజు అయినందున రోజు తెరిచి ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు.కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మొగిలి దుర్గాప్రసాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి సూర్య కృష్ణ గౌడ్, జిల్లా కార్యవర్గ సభ్యులు నరెడ్ల శేఖర్ రెడ్డి, బోడ నరసింహ, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ గుండోజు గంగాధర్,రూరల్ మండల అధ్యక్షులు మట్ట నరేష్ గౌడ్, సీనియర్ నాయకులు కుడుముల రాంరెడ్డి కృష్ణ, బాలరాజ్ గౌడ్ పట్టణ ఉపాధ్యక్షులు అభిగౌడ్ కొల్లూరి శ్రీధర్ పట్టణ ప్రధాన కార్యదర్శి నాప శివ కార్యదర్శి తగుళ్ల వెంకటేష్ యాదవ్ బూత్ అధ్యక్షులు రాఘవేందర్ సాగర్, మల్లేష్, తదితరులు పాల్గొన్నారు.