Take a fresh look at your lifestyle.

పంట వివరాలు కచ్చితంగా నమోదు చేయాలి- కలెక్టర్ ప్రతిమా సింగ్

ముద్ర ప్రతినిధి,, మెదక్:
రైతులకు ప్రభుత్వ పథకాలు అందాలంటే పంట వివరాలను కచ్చితంగా నమోదు చేయాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ వ్యవసాయ అధికారులకు సూచించారు.
మే 10వ తేదీలోపు అన్ని పంటల వివరాలు నమోదు చేయాలని ఆదేశించారు.
సోమవారం కొల్చారం మండలం అప్పాజీ పల్లిలో పంట నమోదు యాప్ పనితీరును క్షేత్రస్థాయిలో కలెక్టర్ పంట పొలాలకు వెళ్లి పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ పంటల నమోదుకు వ్యవసాయ శాఖ గ్రామ స్థాయిలో ప్రైవేట్ సర్వేయర్ల ద్వారా డిజిటల్ పంట సర్వేకి శ్రీకారం చుట్టింది. జియో-రిఫరెన్స్ చేయబడిన కాడాస్ట్రల్ మ్యాప్లు వున్న గ్రామాలలో ప్రయివేట్ సెర్వేయేర్లూ కేంద్ర ప్రభుత్వం యాప్ లో పంట నమోదు చేస్తారు. కాడాస్ట్రల్ మ్యాప్ అందుబాటులో లేని గ్రామాలలో మండల వ్యవసాయ అధికారులు రాష్ట్ర ప్రభుత్వ యాప్ లో పంట నమోదు చేస్తారన్నారు. జిల్లాలో 2,85,774 ఎకరాలకు గాను ఇప్పటి వరకు 39,827 ఎకరాలు నమోదు చేసినట్లు తెలిపారు. వెంట జిల్లా వ్యవసాయ అధికారి దేవకుమార్, ఏఈఓలు, రైతులున్నారు.
*జిల్లా న్యాయమూర్తిని కలసిన కలెక్టర్*


జిల్లా న్యాయమూర్తి నీలిమను కలెక్టర్ ప్రతిమా సింగ్ మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా అభివృద్ధి, న్యాయ పరిపాలనకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు.
జిల్లాలో ప్రజలకు వేగవంతమైన న్యాయ సేవలు అందించేందుకు పరిపాలన, న్యాయ వ్యవస్థ పరస్పర సహకారంతో పనిచేయాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా వారు ప్రస్తావించారు. అలాగే జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సేవల మెరుగుదలకు తీసుకుంటున్న చర్యల గురించి కలెక్టర్ వివరించారు

Leave A Reply

Your email address will not be published.