Take a fresh look at your lifestyle.

నా సంసారంలో నీ వేలేందుకు..?

బీఆర్ఎస్ లో ఉన్నానని ఒప్పుకున్నందుకు సంతోషం
జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కు జీవన్ రెడ్డి కౌంటర్

ముద్ర, జగిత్యాల :

తాను బీఆర్ఎస్ లోనే ఉన్నట్టు ఒప్పుకున్న జగిత్యాల సంజయ్ కు జ్ఞానోదయం కలిగినట్టు ఉందని మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు. పార్టీ ఫిరాయింపు కేసులో బుధవారం అసెంబ్లీ స్పీకర్ ముందుకు వెళ్లిన సంజయ్ తాను బీఆర్ఎస్ లోనే ఉన్నానని వివరణ ఇచ్చుకోవడం సంతోషకరమన్నారు. తాను ఏ పార్టీలో ఉన్నారో ఆయనకు ఇప్పటికైనా గుర్తుకు వచ్చిందన్నారు. ఇప్పటికైనా ఒక క్రమశిక్షణ గల పార్టీ నాయకుడిగా రాజ్యాంగ నిబంధనల మేరకు చట్టసభలకు ఎన్నికైనప్పుడు మన విధులు నిర్వహించాలన్నారు. బుధవారం జగిత్యాలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇన్నాళ్లూ బీఆర్ఎస్ లో ఉన్న నీవు… కాంగ్రెస్ లో హల్ చల్ చేశావంటూ సంజయ్ ను నిలదీశారు. నీ సంసారం నువ్వు చేసుకోకుండా నా సంసారంలో ఎందుకు చిచ్చు పెతున్నావంటూ మండిపడ్డారు. స్పీకర్ తీర్పు వచ్చిన తర్వాత అయినా నీ సంసారం నువ్వు చూసుకోవాలని అన్నారు. కాంట్రాక్టులు, అభివృద్ధి అంటే ప‌క్కింటోడికి క‌న్నం వేయ‌డం కాద‌ని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డితో కలిసి 20 నెలలు ప్రయాణం చేశార‌నీ చేసిన ఒక్క అభివృద్ధి ఏంటో చెప్పు అంటూ ప్ర‌శ్నించారు. అభివృద్ధి కోస‌మే సీఎంతో ప్ర‌యాణం చేస్తున్న‌ట్టు చెబుతున్నాడ‌ని ఏం చేశాడో ఒక్క‌టైనా చెప్పాల‌న్నారు.

Leave A Reply

Your email address will not be published.