Take a fresh look at your lifestyle.

భూ కబ్జాదారుడిని సమర్థిస్తారా, సస్పెండ్ చేస్తారా

  • మాజీ మంత్రి పై KCR, KTRలు వెంటనే చర్యలు తీసుకోవాలి
  • MLA మేఘారెడ్డి డిమాండ్

ముద్ర ప్రతినిధి, వనపర్తి : భూ కబ్జాలకు పాల్పడ్డ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ని బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని వనపర్తి ఎమ్మెల్యే మేఘా రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం వనపర్తి జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జోగులాంబ గద్వాల జిల్లా, మనోపాడు మండలం, చందూర్ గ్రామంలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి బినామీల పేర్ల పై సర్వే నెంబర్ 57 లోని 2ఎకరాల 19 గుంటలు భూమిని భూ ఖబ్జా నిజమేనని నిర్ధారణ కావడం తో రెవెన్యూ శాఖ అధికారులు అక్రమణ దారులకు నోటీసు లు జారీ చేశారని వనపర్తి ఎమ్మెల్యే ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల కు ముందు సేవ్ వనపర్తి-చేంజ్ వనపర్తి నినాదం తో ఆత్మగౌరవం కాపాడుకునేందుకు తనకు అండగా నిలిచిన ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అవినీతి, భూకబ్జాలను నిరూపించడంలో భాగంగా విజిలెన్స్ ఎంఫోర్స్మెంట్ డైరెక్టర్ కు చేసిన ఫిర్యాదు మేరకు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఆదేశాల మేరకు గద్వాల్ జిల్లా కలెక్టర్ సూచనతో రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారులకు సర్వే నిర్వహించి హద్దులు ఏర్పాటు చేశారన్నారు. తాను కబ్జాలకు పాల్పడలేదని ఎన్నికల ముందు నిరూపించాలని సవాల్ విసిరిన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి, BRS నాయకులు ఇప్పుడు ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు.

మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి తనపై వ్యక్తిగత దూషణలకు దిగిన తాను ఎన్నడూ ఎదుటి వ్యక్తి పై వ్యక్తిగత దూషణలకు దిగలేదని స్పష్టం చేశారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం కు 22 2400 కోట్లు ఖర్చు చేసి ఒక్క ఎకరానికి చుక్క నీరు అందలేదని విమర్శించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు తొంబై శాతం పనులు పూర్తయ్యాయని చెప్పుకుంటున్న BRS నాయకులు తాను సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులతో మాట్లాడి 2700 కోట్లు విడుదల చేయిస్తాను పూర్తి చేసి చూపాలని సవాల్ విసిరారు. పదహారు నెలల తన పాలనలో వనపర్తి నియోజకవర్గానికి 1000 కోట్ల విలువ గల అభివృద్ధి పనుల లకు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన చేయించానని గుర్తు చేశారు.

భవిష్యత్తులో వనపర్తి నియోజకవర్గంలో సాగునీటి సమస్య తలెత్తకుండా శాశ్వత పరిష్కారం చూపేందుకు 12 లక్షల కోట్ల రూపాయలతో చెరువుల పునరుద్ధరణ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి నివేదికలను సిద్ధం చేస్తున్నామన్నారు. సీజన్లో రికార్డు స్థాయిలో 3 లక్షల 90 వేల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని రైతులు పండించారన్నారు. కొనుగోలు కేంద్రాల నిర్వహణ రైతులపై ముసలి కన్నీరు చూపుతున్నారని ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వం హయాంలో చేసిన నిర్వాకం వల్లే నేడు మిల్లర్లు 700 కోట్ల రూపాయల బకాయిలు పడ్డారని ఈ పాపం ఎవరిదని ఆయన ప్రశ్నించారు.

వరి ధాన్యం కొనుగోళ్లలో చివరి గింజ వరకు కొంటామని అన్నదాతలు ఎవరు అధైర్య పడగలను ఆయన సూచించారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో అవినీతి లేని అభివృద్ధిని చేసి చూపిస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, pcc సభ్యులు శంకర్ ప్రసాద్, జిల్లా దిశ కమిటీ సభ్యురాలు ధనలక్ష్మి, మాజీ మున్సిపల్ చైర్మన్ పుట్టపాకుల మహేష్, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వాకిటి ఆదిత్య, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు చీర్ల చందర్, పట్టణ మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.