Take a fresh look at your lifestyle.

జీలుగు విత్తనాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి

  • పచ్చిరొట్ట ఎరువు వాడకంతో రసాయనిగా ఎరువుల వాడకం తగ్గుతుంది.
  • డిసిసిబి డైరెక్టర్ సింగిల్ విండో చైర్మన్ గుడిపాటి సైదులు.

 ముద్ర, తుంగతుర్తి: రైతులకు సబ్సిడీపై జీలుగ విత్తనాలు పంపిణీ చేయనున్నట్లు ఉమ్మడి నల్లగొండ జిల్లా డిసిసిబి, డైరెక్టర్ తుంగతుర్తి సింగిల్ విండో చైర్మన్ గుడిపాటి సైదులు తెలిపారు.సోమవారం మండల కేంద్రంలోని సొసైటీ కార్యాలయంలో రైతులకు పచ్చిరొట్ట ఎరువుగా ఉపయోగపడే జీలుగు విత్తనాల బస్తాలు పంపిణీ చేసి మాట్లాడారు.ఈ వానకాలం సీజన్‌కు సంబంధించి 50 శాతం సబ్సిడీపై పచ్చి రొట్ట(జీలుగ)విత్తనాలు అందుబాటులో ఉన్నాయన్నారు. మండలానికి 3 టన్నులు జీలుగ విత్తనాలు వచ్చినట్లు తెలిపారు.30 కిలోల జీలుగ విత్తనాల బస్తా మొత్తం ధర రూ.4275 ఉండగా, 50 శాతం ప్రభుత్వ సబ్సిడీ పోగా, రైతు రూ. 2137 చెల్లించాలన్నారు. మండలంలో జీలుగ విత్తనాలు అవసరం ఉన్న రైతులు తమ పట్టాదార్ పాస్ పుస్తకం జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకుని వచ్చి విత్తనాలు తీసుకోవాలని కోరారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ శాఖ ఇంచార్జ్ ఏడిఏ బాలకృష్ణ, ఏఈఓ సృజన, సొసైటీ వైస్ చైర్మన్ మొడెం శ్రీలత, సీఈఓ వెంకటేశ్వర్లు, డైరెక్టర్లు యాదగిరి, మజీద్, బిక్షం రెడ్డి, రామ నరసమ్మ, ఈదప్ప, యాకయ్య, రవీందర్ రెడ్డి, సొసైటీ సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు.

  • రాష్ట్ర అవతరణ సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరణ.

మండల కేంద్రంలోని రైతు సేవా సహకార సంఘం కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ సందర్భంగా జాతీయ జెండాను డిసిసిబి డైరెక్టర్ సొసైటీ చైర్మన్ గుడిపాటి సైదులు ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో ఏడీఏ బాలకృష్ణ సిబ్బంది రైతులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.