Take a fresh look at your lifestyle.

కాంగ్రెస్ తో కేంద్ర మంత్రి బండి సంజయ్ మిలాకత్ ఎమ్మెల్యే మక్కాన్సింగ్ కోట్లాది రూపాయల అవినీతి బాగోతం

  •  ఇసుక, బూడిద, ఓసిపి 5 దందాలో కోట్ల రూపాయలు వసూలు అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే అభివృద్ధి పేరుతో విధ్వంసం బీఆర్ఎస్ నాయకుడు కౌశిక హరి ధ్వజం

ముద్ర ప్రతినిధి, గోదావరిఖని: ఇసుక, మట్టి, బూడిద, ఓసిపి 5 కాంట్రాక్టర్ దగ్గర కోట్ల రూపాయలు వసూలు చేసి ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అవినీతికి పాల్పడుతున్నాడని బి.ఆర్.ఎస్ నాయకుడు కౌశిక్ హరి ఆరోపించారు. బుధవారం గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్.టి.పి.సి మహారత్నలాంటి సంస్థ లో బూడిద కాంట్రాక్ట్ లోడింగ్ 500 కు ఇవ్వాల్సి ఉండగా, తన అనుచర వర్గానికి రూ.4 వేలకు పనులు కేటాయించి కోట్లాది రూపాయల అవినీతికి పాల్పడుతున్నారని విమర్శించారు. తన అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు రోడ్ల వెడల్పుతో అభివృద్ధి పేరుతో విధ్వంసం సృష్టిస్తూ, తన అక్రమాలు తెలియకుండా ప్రజల ద్రుష్టిని మళ్లిస్తున్నాడని ఆరోపించారు. బీజేపీకి చెందిన కేంద్రమంత్రి బండి సంజయ్, కాంగ్రెస్ తో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకోవడంతోనే అవినీతిని ప్రశ్నించడం లేదని, తనకు వాటా ఇస్తున్నాడేమో అని అనుమానం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఒక్క ఛాన్స్ అంటూ జనాల దగ్గర ఏడ్చి ఎన్నికల్లో గెలుపొంది ఇప్పుడు జనాలను ఏడిపిస్తున్నాడని ఆరోపించారు. సంవత్సర కాలంలో చేసిన అభివృద్ధి లేదు పుట్టిన ఊరు రామగుండంలో తట్టెడు మట్టి కూడా ఎత్తలేదని ఎద్దేవా చేశారు.

గోదావరిఖనిలో వ్యాపార కేంద్రాలు అభివృద్ధి రోడ్ల వెడల్పు పేరుతో కూల్చివేతలకు పాల్పడుతూ భూకంపంలా మార్చారని కూల్చివేసిన ప్రాంతాల్లో అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. రెండేళ్ళ క్రితం రోడ్లు బాగా లేవని ధర్నా చేసిన మక్కాన్సింగ్ గెలిచి సంవత్సరం కాలంగా రోడ్లను ఎందుకు పూర్తి చేయడం లేదని ప్రశ్నించారు. బూడిద కుంభకోణం, ఆర్.ఎఫ్.సి.ఎల్ ఉద్యోగాల దందా, ఓసిపి 5 కాంట్రాక్టర్ దగ్గర అవినీతి అక్రమాలు, హైదరాబాదులో ఆర్ఆర్ టాక్స్ లాగా. ఇక్కడ ఎమ్మెస్ఆర్ టాక్స్ అని ఒక్కొక్కటి అన్ని బయట పెడతామని హెచ్చరించారు. ఎమ్మెల్యే భజనపరులు వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడకూడదన్నారు. మళ్లీ ఎమ్మెల్యేగా గెలవడనే ఉద్దేశంతో అవినీతికి పాల్పడుతున్నాడని, ఆయనకు కొమ్ము కాస్తూ కాంగ్రెస్ నాయకులు తమ భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని సూచించారు. ఎన్నారై హరీష్ రెడ్డి ఎమ్మెల్యే ఇసుక దందాపై ఒక వీడియో చేస్తే కొందరు నోటికి వచ్చినట్టు మాట్లాడారని వాళ్లతో ఎమ్మెల్యే మాట్లాడించాడని ఇసుక దందా పై వివరణ ఇవ్వాల్సింది పోయి రౌడీలా మాట్లాడిస్తూ బెదిరింపు ధోరణితో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో మాట్లాడే హక్కు లేకుండా రౌడీయిజాన్ని చూపిస్తూ పోలీసులతో అడ్డుకుంటూ అవినీతి దందాకు పాల్పడుతున్నాడని వీటన్నింటికీ బెదిరేది లేదని అన్నారు. బూడిద లోడింగ్ లో స్థానికంగా 1500 లారీలు డ్రైవర్లు యజమానులు కుటుంబాలు ఆధారపడి ఉన్నవారికి లోడింగ్ ఇవ్వాల్సింది పోయి, స్థానికేతర్లకు కొమ్ముకాస్తున్నాడని ఆరోపించారు. గోదావరిఖని పట్టణ ప్రాంతాన్ని ప్రాణాళికాబద్ధంగా అభివృద్ధి చేయాలని, కూల్చివేతలతో భయభ్రాంతులకు గురిచేయొద్దని హితవు పలికారు. తనకు అనుకూలంగా లేని, నిజాయితీగా పనిచేసే అధికారులను బెదిరిస్తూ బదిలీలు చేస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే బెదిరింపులకు ప్రజలు భయపడొద్దని ముందుకు రావాలని అన్నారు. ఎమ్మెల్యే అవినీతి, అక్రమాలపై ఆందోళనకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ విలేకరుల సమావేశంలో బిఆర్ఎస్ నాయకుడు మాదాసు రామ్మూర్తి, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.