- ఆర్.జి 1 ఏరియా సేవా అధ్యక్షురాలు శ్రీమతి అనిత లలిత్ కుమార్.
ముద్ర ప్రతినిధి,గోదావరిఖని: గోదావరిఖని సెక్టర్.2 సింగరేణి ఉన్నత పాఠశాల 49వ వార్షికోత్సవ వేడుకలు బుధవారం సాయంత్రం అంగరంగ వైభవంగా నిర్వహించారు. పాఠశాల హెడ్ మాస్టర్ శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్జీ1 సేవా అధ్యక్షురాలు శ్రీమతి డి.అనిత లలిత్ కుమార్,శ్రీనివాస్ ఎడ్యుకేషన్ సెక్రటరీ,కార్పొరేట్ కొత్తగూడెం హాజరయి జ్యోతి ప్రజ్వలన చేసి వార్షికోత్సవ వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా అనిత లలిత్ కుమార్ మాట్లాడుతూ సింగరేణి ఉన్నత పాఠశాలలో నాణ్యమైన విద్యను అతి తక్కువ ఫీజుతో అందిస్తున్నామని,ఈ అవకాశాల్ని స్థానిక ప్రజలు వినియోగించు కోవాలని కోరారు. అలాగే విద్యార్థులు మంచిగా చదివి తల్లిదండ్రులకు,ఉపాధ్యాయులకు,సింగరేణి యాజమాన్యంకు మంచిపేరు తీసుకొని రావాలని అన్నారు.
పాఠశాలకుఅవసరమైన అన్ని సౌకర్యాలను అందించేందుకు ఆర్జీ-1 యాజమాన్యం ఎల్లవేళలాసిద్ధంగా ఉందని,విద్యార్థులు బాగా చదివి, మంచి అవకాశాలు అందిపుచ్చు కోవాలని సూచించారు.అలాగే 10వ తరగతి విద్యార్థులు పట్టుదలతో చదివి ఉత్తమ ఫలితాలు సాదించాలని కోరారు. వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా నిర్వహించిన పలు రకాల క్రీడాల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు అతిథుల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు.విద్యార్థులు నిర్వహించిన నృత్య ప్రదర్శనలు అందరిని ఆకర్శించాయి. ఈ కార్యక్రమంలో డిజియం (పర్సనల్)పాఠశాలకరస్పాండెంట్ కిరణ్ బాబు,శ్రీదేవి శ్రీనివాస్, చిలుక లక్ష్మి లేడీస్ క్లబ్ సెక్రటరీ, టీచర్స్ స్వర్ణలత,రాధిక,శ్రీలత, సుజాత,శశికళ,హెప్సిబా,కుమార స్వామీ,శ్రీనివాస్ పూర్వచందర్, రేష్మ ,తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు,అధికారులు స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.