Take a fresh look at your lifestyle.

పకడ్బందీగా ఇందిరమ్మ కమిటీలు వేయాలి

  • జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్.

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: ఇందిరమ్మ ఇండ్లు మంజూరి కొరకు లబ్ధిదారులు అర్హత పరిశీలించేందుకు జిల్లా కలెక్టరేట్ మీటింగ్ హాల్లో ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ బిఎస్ లతాతో కలిసి జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్. పాల్గొన్నారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టబడిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పథకం ద్వారా ఇందిరమ్మ ఇల్లు మంజూరు కొరకై సొంత స్థలం కలిగి ఇండ్లు లేని నిరుపేదలను గుర్తించుట కొరకై జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో నలుగురిని గెజిటెడ్ స్పెషల్ ఆఫీసర్ లను మండలాల వారిగా కమిటీలు ఏర్పాట్లు చేసి పకడ్బందీ గా అవకతవకలు తావు లేకుండా చూడాలని అధికారులకు సూచించారు.ఇల్లు లేని నిరుపేదలు దరఖాస్తులు చేసుకున్న వారికి పకడ్బందీగా వెరిఫికేషన్ చేయాలని కోరారు.రాష్ట్ర అధికారుల ఆదేశాల, సూచనలు పాటిస్తూ ఆయా గ్రామంలోని ఇందిరమ్మ కమిటీల ద్వారా దరఖాస్తుల జాబితాలను పరిశీలిస్తూ ఇల్లు లేని నిరుపేదలకు గుర్తించి వలసిందిగా అధికారులను ఆదేశించారు.ఇందిరమ్మ ఇండ్లకు అర్హులను గుర్తించేటప్పుడు పలు అంశాలను పరిణయం తీసుకోవాలని, సొంత ఆర్ సి సి ఇండ్లు కలిగి ఉండరాదనీ,2.5 ఎకరాల పైన వ్యవసాయ భూమి,సొంత కారు ఉండరాదు,కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగం కలిగి ఉండరాదన్నారు.అలాగేవలస వెళ్లిన వారై ఉండరాదనీ,ఆదాయపు పన్ను చెల్లించిన వారై ఉండరాదు.లబ్ధిదారులు తప్పనిసరిగా బిపీఎల్ దరిద్ర రేఖ దిగువ అయి ఉండాలన్నారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి ఎస్ లత హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్, రెవెన్యూ డివిజనల్ అధికారులు, ఎంపీడీవోలు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.