ముద్ర ప్రతినిధి, కల్వకుర్తి: ఇంటర్ పరీక్ష ఫలితాల్లో కల్వకుర్తి ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ప్రతిభ కనబరచడంతో వారిని బుధవారం ప్రిన్సిపాల్ రాంరెడ్డి ఘనంగా సత్కరించారు.ఉత్తమ ఫలితాలతో పాటు జిల్లా రాష్ట్రస్థాయిలోనూ ర్యాంకులు సాధించడంతో వారిని ప్రత్యేకంగా అభినందించారు.పట్టుదలతో చదువుకొని ఆర్ట్స్, సైన్స్,వొకేషనల్ విభాగాల్లో జిల్లా,రాష్ట్ర స్థాయిలో ప్రతిభను చాటడం అభినందనీయమన్నారు.ప్రభుత్వ కళాశాలలో అనుభవమైన ఆధ్యాపకులు ఉండడం అన్ని వసతులు ఉండడంతో మంచి నాణ్యమైన విద్య అందించడం జరుగుతుందని, ప్రథమ సంవత్సరంలో అధిక మంది విద్యార్థులు ప్రవేశాలు పొందాలని అన్నారు. కార్యక్రమంలో అధ్యాపకులు పాల్గొన్నారు.