Take a fresh look at your lifestyle.

ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

ముద్ర ప్రతినిధి, మెదక్:
మెదక్ జిల్లాలో ఈనెల 25 నుంచి జరిగే ఇంటర్మీడియట్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి మాధవి తెలిపారు. జిల్లాలో మొత్తం విద్యార్థులు -12,334 పరీక్షలు రాయనున్నారు. ఫస్ట్ ఇయర్ జనరల్ -5710 మంది విద్యార్థులు,
ఫస్ట్ ఇయర్ ఒకేషనల్ -599 మంది విద్యార్థులు,
మొత్తం -6309 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు.
సెకండ్ ఇయర్ జనరల్ -5472 మంది,
సెకండ్ ఇయర్ ఒకేషనల్- 533 మంది,
మొత్తం-6025 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఇందుకోసం 28పరీక్ష కేంద్రాలు, 5 ఫ్లైయింగ్ స్క్వాడ్, 4 సిట్టింగ్ స్క్వాడ్ బృందాలు ఏర్పాటు చేశామని మాధవి వివరించారు.

Leave A Reply

Your email address will not be published.