Take a fresh look at your lifestyle.

కెసిఆర్ సిఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారు..మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు

 

బీరప్ప ఉత్సవాలకు కెసిఆర్ గారు సహాయం అందించారు.. మిమ్మల్ని గుర్తు చేశారు…

– బీరప్ప స్వామి దయతో ఊరంతా ఐక్యత తో ఉండాలి…

– చింతమడక బీరప్ప ఉత్సవాల్లో పాల్గొన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు

సిద్దిపేట, ముద్ర ప్రతినిధి :

చింత మడక గ్రామం లో జరిగిన బీరప్ప ఉత్సవాల్లో పాల్గొన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొన్నారు ఉత్సవాల్లో భాగంగా బీరప్ప స్వామి ని దర్శించుకున్నారు. గ్రామంలో ఏర్పాటు చేసిన కథ లో పాల్గొని మాట్లాడారు. కెసిఆర్ మీ అందరిని అడిగనట్లు చెప్పారని, బీరప్ప ఉత్సవాలకు సహాయం కూడ అందించారన్నారు.. కెసిఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారని బీరప్ప స్వామి దయతో మీ అందరి ఆశీస్సులతో కెసిఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడన్నారు.. బీరప్ప ఉత్సవాలు అద్భుతంగా నిర్వహించారని గ్రామ ప్రజలు అందరు ఐక్యత తో ఉండాలని ఆకాంక్షించారు, తన వంతు సహాయం గా లక్ష రూపాయలు ఇచ్చానన్నారు. స్వామి దయతో అన్నింటా శుభం జరగలాన్నారు.

Leave A Reply

Your email address will not be published.