Take a fresh look at your lifestyle.

ఇంటర్ పరీక్ష కేంద్రాల వద్ద భారీ బందోబస్త్- ఎస్పీ శ్రీనివాస్ రావు

ముద్ర ప్రతినిధి, మెదక్:
ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు సజావుగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు పరీక్ష కేంద్రాల వద్ద పటిష్టమైన పోలీస్ బందోబస్త్ ఏర్పాటు చేసినట్లు ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు తెలిపారు. జిల్లా పరిధిలోని పరీక్ష కేంద్రాల వద్ద శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా సెక్షన్ 163 బిఎన్ఎస్ఎస్ (144 సెక్షన్) అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
మెదక్ జిల్లా పరిధిలోని మొత్తం 28 ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాల్లో 12,334 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారని తెలిపారు. ఈనెల 25 నుండి మార్చి 18 వరకు, ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించనున్నట్లు వివరించారు.
పరీక్షల సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలుగా నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయని ఎస్పీ తెలిపారు.
అలాగే ప్రశ్నాపత్రాల రవాణాకు ప్రత్యేక ఎస్కార్ట్ ఏర్పాటు చేశామని, పరీక్ష కేంద్రాల పరిసర ప్రాంతాల్లో అనుమానాస్పద వ్యక్తులపై నిఘా ఏర్పాటు చేసి, ఎలాంటి ఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు

 

Leave A Reply

Your email address will not be published.