ముద్ర. పరకాల.

తెలంగాణలో 10 సంవత్సరాల టిఆర్ఎస్ పాలనలో ప్రజలకు మోసాలు తప్ప మిగిలింది ఏమి లేదని పరకాల ఎమ్మెల్యే రేవుడి ప్రకాశ్ రెడ్డి విమర్శించారు. గత రెండు మూడు రోజులుగా పరకాల పట్టణంలో నీ వివిధ వార్డులలో విస్తృతంగా తిరుగుతూ అభ్యర్థుల తరఫున ప్రచారాన్ని నిర్వహించారు. 6 7 14 17 18 19 వార్డులలో ప్రచారాన్ని నిర్వహించారు.తెలంగాణలో ప్రజలను ఓట్లు అడిగే నైతిక హక్కు, టిఆర్ఎస్ పార్టీకి లేదని ఆయన మండిపడ్డారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చింది కేసీఆర్ వల్ల కాదని తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ సహకారం అందించడం వలన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన విషయాన్ని ప్రజలు ఇప్పటికీ మర్చిపోవడం లేదన్నారు. ఎంతోమంది త్యాగమూర్తులు మేధావులు ఉద్యమకారులు పోరాట పట్టిన వల్ల ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర అవతరణకు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వచ్చిందన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన కాలంలో తెలంగాణ ప్రజలు రాచరిక వ్యవస్థ పోకడలను అనుభవించారని అందుకు ఆవేదనగా ఆ పార్టీని ఎన్నికలలో ఓడించడం జరిగిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి అన్నారు. గడిచిన రెండు సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో ప్రజలు సుభిక్షంగా ఉన్నారని రేవూరి ప్రకాశ్ రెడ్డి తెలిపారు. ప్రజలకు సన్నబియ్యం ఉచిత విద్యుత్ ఉచిత బస్సు ప్రయాణం లాంటి ఎన్నో రకాలైన సౌకర్యాలను ప్రజలు కోరిన విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న విషయాన్ని ఆయన ఓటర్లకు వివరించారు. పరకాల మున్సిపాలిటీలో కాంగ్రెస్ గెలుపును ఆపడం ఎవరి తరం కాదన్నారు ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి అత్యధిక స్థానాలను కట్టబెడతారు అన్న విశ్వాసాన్ని రేవూరి ప్రకాష్ రెడ్డి వ్యక్తం చేశారు కార్యక్రమంలో వివిధ వార్డులకు చెందిన అభ్యర్థులు పార్టీ నాయకులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.