Take a fresh look at your lifestyle.

ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ ప్రచారం షురూ 13వ, 27వ డివిజన్‌లో ఇంటింటి ప్రచారంలో అంబటి జోజిరెడ్డి

 

 

– మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తన ఎన్నికల ప్రచారాన్ని కరీంనగర్ నగరంలో జోరుగా ప్రారంభించింది. ఈ ప్రచార కార్యక్రమానికి పార్టీ రాష్ట్ర కన్వినర్ అంబటి జోజిరెడ్డి హాజరై, జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్ తో కలసి 13వ డివిజన్ ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి పెంట స్వరూప సత్యం, 27 వ డివిజన్ శ్యామల కిరణ్ వెంట ఇంటింటికి వెళ్లి ఓటర్లను కలుసుకుంటూ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. సింహం గుర్తుకు ఓటు వేయాలని ప్రజలను అభ్యర్థించారు.
ఈ సందర్భంగా జోజిరెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల ఆశించిన ఫలితాలను ఇవ్వడంలో పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించారు. పేదలు, కార్మికులు, మధ్యతరగతి ప్రజలకు మేలు చేయాల్సిన పథకాలు కాగితాలకే పరిమితమయ్యాయని ఆరోపించారు. అలాగే గత బీఆర్‌ఎస్ పాలనలో కరీంనగర్ స్మార్ట్ సిటీ పేరిట ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారని అన్నారు.
అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ విధానాలు కూడా ప్రజావ్యతిరేకంగా ఉన్నాయని, ధరల పెరుగుదల, నిరుద్యోగం, ప్రజా రంగ సంస్థల ప్రైవేటీకరణ వల్ల సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఈ రెండు ప్రభుత్వాల విధానాల వల్ల ప్రజలు విసిగిపోయారని, ప్రజల సమస్యలపై నిజంగా పోరాడే పార్టీ ఫార్వర్డ్ బ్లాక్ మాత్రమేనని జోజిరెడ్డి స్పష్టం చేశారు.
ఈ పరిస్థితుల్లో ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని, పరిష్కారానికి కృషి చేసే అభ్యర్థి పెంట స్వరూప సత్యాన్ని గెలిపించాలని ఆయన ఓటర్లను కోరారు. 13వ, 27వ డివిజన్ అభివృద్ధికి ఫార్వర్డ్ బ్లాక్ స్పష్టమైన కార్యాచరణతో ముందుకు వెళ్తుందని తెలిపారు.కరీంనగర్ నగరంలో ఫార్వర్డ్ బ్లాక్ పార్టీకి రోజురోజుకీ ప్రజల మద్దతు పెరుగుతోందని, ఈ ఎన్నికల్లో అధిక స్థానాలను కైవసం చేసుకునే దిశగా పార్టీ బలంగా అడుగులు వేస్తోందని జోజిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు.ఈ ప్రచార కార్యక్రమంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్, ముత్యాల విజయ్ కుమార్ ,కార్యకర్తలు పాల్గొన్నారు.

బండారి శేఖర్
జిల్లా ప్రధాన కార్యదర్శి
కరీంనగర్
ఫోన్ :9652228294

Leave A Reply

Your email address will not be published.