Take a fresh look at your lifestyle.

విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు అంబులెన్స్ డ్రైవర్ పై వేటు

సంగారెడ్డి ముద్ర ప్రతినిధి:

జోగిపేట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని పరిశీలిస్తున్న డీసీహెచ్ఎస్.
డీసీహెచ్ఎస్ డాక్టర్ షరీఫ్ మంగళవారం జోగిపేట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి తనిఖీ చేశారు సోమవారం వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన విషయం విధితమే. మంత్రి అక్కడి నుంచి డీసీహెచ్ఎస్కు ఎంక్వయిరీకి ఆదేశించారు. ఈ మేరకు ఆయన తనిఖీ చేశారు. వార్డుల్లో తిరిగి రోగులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడుగగా పేషెంట్ కు బెడ్ పైన రెస్ట్ గా ఉండేందుకు వీల్ బెడ్స్, రోగులకు వెస్ట్రన్ బాత్రూం కావాలి అని అడుగటంతో సమస్య తీరుస్తామని హామీ ఇచ్చారు. అలాగే అంబులెన్స్ సౌకర్యం గురించి రోగులను అడగగా.. 108 మాత్రమే ఉచితంగా సేవ చేస్తుంది కాని హాస్పిటల్ సంబంధించిన j అంబులెన్స్కు మాత్రం వెయ్యి రూపాయల డీజిల్తో పాటు బత్తా రూ. 200 చెల్లిస్తున్నట్లు రోగులు నేరుగా జిల్లా అధికారికి పిర్యాదు చేశారు. వెంటనే ఆ డ్రైవర్ని పిలిపించి డబ్బులు తీసుకుంటున్న విషయం అడుగగా ఇప్పుడు కొత్త కాదు సార్ గత 25 ఏళ్లుగా వసూలు చేస్తున్నామని చెప్పడం గమనార్హం. మంత్రి వచ్చినప్పుడు లీవ్లో ఉన్న ఏడు మంది వైద్యులు , అలాగే చీటికిమాటికి డుమ్మాలు కొట్టే వైద్యులతో పాటు అంబులెన్స్ డ్రైవర్ పై కూడా తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ కి నివేదిక పంపనున్నట్లు చెప్పారు. ఈ ఆస్పత్రిలో మొత్తంగా 31 మంది డాక్టర్లు అవసరం ఉండగా పది మంది రెగ్యులర్ డాక్టర్లు పనిచేస్తున్నారు. కొందరిని జిల్లాలోని ఆసుపత్రుల నుండి సర్దుబాటు చేస్తూ 23 మంది జోగిపేట హాస్పిటల్లో పనిచేస్తున్నరు కానీ డాక్టర్లు సమయపాలన లేకుండా విధులకు హాజరు కాకుండా నిర్లక్ష్యం వహిస్తున్న డాక్టర్లకు సిబ్బందికి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఉన్నత అధికారులకు నివేదికను సమర్పిస్తున్నట్లు తెలిపారు

Leave A Reply

Your email address will not be published.