Take a fresh look at your lifestyle.

 రోడ్డు భద్రతే జీవన రక్ష: కూకట్పల్లిలో ‘ఆరైవ్ ఆలైవ్’ అవగాహన సదస్సు

 
ముద్ర కూకట్పల్లి :

సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని కూకట్పల్లి జెనెసిస్ స్కూల్‌లో బుధవారం కూకట్పల్లి పోలీసుల ఆధ్వర్యంలో ఆరైవ్ ఆలైవ్ రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ సదస్సుకు కూకట్పల్లి అదనపు డీసీపీ సుదర్శన్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు, యువతకు దిశానిర్దేశం చేశారు.


ఈ సందర్భంగా అదనపు డీసీపీ సుదర్శన్ మాట్లాడుతూ, ప్రస్తుత కాలంలో రోడ్డు ప్రమాదాలు పెరగడానికి ప్రధాన కరణం సరైన నిద్ర లేకపోవడం, గమ్యస్థానానికి తొందరగా చేరుకోవాలనే ఆత్రుత ప్రాణాల మీదకు తెస్తోంది. ప్రతి ఒక్కరూ స్టార్ట్ ఎర్లీ – గో స్లోలీ – రీచ్ సేఫ్లీ (త్వరగా బయలుదేరండి – నిమ్మదిగా వెళ్లండి – సురక్షితంగా చేరండి) అనే సూత్రాన్ని పాటించాలని ఆయన కోరారు. జుట్టు రాలిపోతుందనే చిన్నపాటి అపోహతో హెల్మెట్ ధరించకపోవడం వల్ల ప్రమాదం జరిగినప్పుడు ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. మానవ ప్రాణం ఎంతో అమూల్యమైనది. మీపై ఆధారపడిన కుటుంబ సభ్యుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ బాధ్యతగా వాహనాలు నడపాలి
నేటి కాలంలో విద్యార్థులు, యువత ఎక్కువగా రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్నారని, అందుకే వారిలో మార్పు తీసుకురావడానికి ఇలాంటి కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జెనెసిస్ స్కూల్ విద్యార్థులతో పాటు కూకట్పల్లి లా & ఆర్డర్ ఎస్ హెచ్ ఓ , ట్రాఫిక్ ఎస్ హెచ్ ఓ, పోలీసు అధికారులు మరియు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.
End

Leave A Reply

Your email address will not be published.