రామకృష్ణాపూర్, ముద్ర విలేకరి : నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న ఆర్(పీ)ఎంపిలపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ ఎగ్గెన శ్రీనివాసును పట్టణ సీపీఐ నాయకులు కోరారు.బుధవారం జిల్లా కేంద్రంలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో కౌన్సిల్ చైర్మన్ ఎగ్గెన శ్రీనివాసును కలిసి వినతి పత్రాన్ని అందజేశారు.జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, కార్యవర్గ సభ్యులు మిట్టపెల్లి శ్రీనివాస్, పౌల్, సత్యనారాయణ, గోపి, మల్లేష్, రాయమల్లు పాల్గొన్నారు.