Take a fresh look at your lifestyle.

గుంతల మయంగా మారిన తుంగతుర్తి మెయిన్ రోడ్డు పనులను తక్షణమే ప్రారంభించాలి

  • గత ప్రభుత్వ హయాంలోనే రోడ్డు పనులకు 3 కోట్ల 50 లక్షల నిధుల మంజూరు.
  • మాజీ ఎంపీపీ బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు తాటికొండ సీతయ్య.
  • టెండర్ పూర్తయిన పనులు ప్రారంభించకపోవడం పట్ల బీఆర్ఎస్ శ్రేణుల నిరసన.

తుంగతుర్తి, ముద్ర: తుంగతుర్తి మండల కేంద్రంలోని మెయిన్ రోడ్డు పునర్నిర్మాణానికి గత ప్రభుత్వం లో 3.50లక్షల రూపాయల నిధులను మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ మంజూరు చేశారని అయినా నేటి వరకు పనులు ప్రారంభించకపోవడం శోచనీయమని బి ఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు తాటికొండ సీతయ్య అన్నారు. బుధవారం టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రోడ్డు పనులు చేపట్టకపోవడం నిరసిస్తూ మెయిన్ రోడ్డుపై నిరసన ప్రదర్శన జరిపారు ఈ సందర్భంగా సీతయ్య మాట్లాడుతూ రోడ్డు వెడల్పు చేసి సెంటర్ లైటింగ్ ఏర్పాటు చేసేవిధంగా పని మంజూరి చేసి టెండర్ ప్రక్రియ పూర్తి చేసి గతంలోనే శంకుస్థాపన చేయడం జరిగిందని అన్నారు తదనంతరం గత ఎన్నికల్లో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు పనులు ప్రారంభించక పోవడం వలన ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నాంరని ప్రభుత్వం దృష్టికి తేవాలనే ఉద్దేశ్యం తో బి ఆర్ ఎస్ పార్టీ శ్రేణులు రోడ్డుపై పొర్లు దండాలు పెడుతూ నిరసన తెలియ చేశారని అన్నారు. తక్షణమే రోడ్డు పనులు ప్రారంభించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమం లో జిల్లా నాయకులు గుండాగానీ రాములుగౌడ్ మండల నాయకులు గోపగాని రమేష్, కడారి దాసు, గుడిపాటి వీరయ్య, గాజుల యాదగిరి, మాజీసర్పంచులు కొండగడుపుల నాగయ్య, వీరోజీ, రాములు నాయక్, మల్లెపాక రాములు, సోమేశ్, తడకమళ్ల రవికుమార్, గోపగాని వెంకన్న, వెంకటేష్, మల్లేష్, సాయికిరణ్,వెంకన్న, అశోక్, మల్లిఖార్జున్, జాని తో పాటు పలువురు నాయకులు. కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.