ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్:
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని గీతాంజలి జూనియర్ కళాశాల విద్యార్థులు తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి ర్యాంకులతో సత్తా చాటారు. పాస్ శాతంలో కూడా కళాశాల ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుంది.
మొదటి సంవత్సరం ఎంపీసీ విభాగంలో 470 మార్కులకు గాను శ్రీ వైష్ణవి (H.T. No: 2655103941), ఎం. యమున (H.T. No: 2655102937), ఎ. శాస్రిక (H.T. No: 2655102661) తలో 463 మార్కులు సాధించారు.
బైపీసీ విభాగంలో 440 మార్కులకు గాను ఓ. దివిజ (H.T. No: 2655103836), సోహ తలో 436 మార్కులు సాధించారు.
సీఈసీ విభాగంలో 500 మార్కులకు గాను ఎ. చంద్రలేఖ (H.T. No: 2655103529) 491 మార్కులు సాధించి జిల్లా స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచారు.
ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం ఫలితాల్లో కూడా కళాశాల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు.
బైపీసీ విభాగంలో 1000 మార్కులకు గాను నిఖిత (H.T. No: 2655203521) 993 మార్కులు సాధించగా,
ఎంపీసీ విభాగంలో సైదా మెహరీన్ (H.T. No: 2655203150) 991 మార్కులు,
సీఈసీ విభాగంలో పి. అనిల్ (H.T. No: 2655202935) 943 మార్కులు సాధించి జిల్లా స్థాయిలో మెరుగైన ఫలితాలు నమోదు చేశారు.
ఈ సందర్భంగా ప్రతిభ కనబరిచిన విద్యార్థులను కళాశాల కరస్పాండెంట్ మరియు పట్టణ మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీ సునేంద్ర గారు, ప్రిన్సిపాల్ శ్రీ శరత్ బాబు గారు, కరస్పాండెంట్స్ డాక్టర్ ప్రవీణ్ కుమార్ గారు, ఉదయ్ కుమార్ గారు మరియు అధ్యాపక బృందం శాలువాలతో సన్మానించి అభినందించారు.