Take a fresh look at your lifestyle.

జగిత్యాలలో ముస్లిం యువకుడి మత సామరస్యం…

11 రోజుల పాటు హనుమాన్ దీక్ష…
కొండగట్టులో దీక్ష విరమణ…

ముద్ర ప్రతినిధి, జగిత్యాల:

హనుమాన్ దీక్ష స్వీకరించి ఓ ముస్లిం యువకుడు మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్న సంఘటన జగిత్యాల జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే… జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం పూడూరు గ్రామానికి చెందిన మహమ్మద్ యూసుఫ్ హనుమాన్ దీక్ష స్వీకరించాడు. అలాగే 11 రోజులపాటు హనుమాన్ దీక్షను భక్తిశ్రద్ధలతో కొనసాగించడం విశేషం. గతంలో అయోధ్య నుంచి పూడూరు వరకు శ్రీరామచంద్రుడి పాదుకలను పాదయాత్రగా తీసుకొచ్చి కార్యక్రమంతో పాటు గ్రామంలో రామాలయం నిర్మాణంలో చురుగ్గా పాల్గొన్నాడు. హనుమాన్ జయంతి సందర్భంగా కొండగట్టుకు వెళ్లి మాల విరమణ చేసి అన్ని మతాలు సమానమనే సందేశానిస్తూ మతాలకు అతీతంగా మాలధారణ చేసి గ్రామస్తుల ప్రశంస్థలు పొందాడు.

Leave A Reply

Your email address will not be published.