రైతుకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం-ఎలగందుల,ఆసిఫ్ నగర్ వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన సుడా చైర్మన్
గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులను దోచుకున్నారు
రైతుకు ఎల్లప్పుడూ కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు.ఎలగందుల,ఆసిఫ్ నగర్ వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి రైతులతో మాట్లాడారు.గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులు పండించిన ధాన్యానికి తప్ప,తాలు పేరు మీద అనేక ఇబ్బందులకు గురిచేశారని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత రైతులను అన్ని రకాలుగా ఆదుకుంటున్నామని అన్నారు.

టార్పాలిన్లు కాని,కాంటలు కాని ధాన్యం ట్రాన్స్ పోర్ట్ సమస్య ఎది ఉండకుండా చూడాలని అధికారులను కోరారు.ఈ కార్యక్రమాలలో డిపిఎం సుధారాణి,ఎపిఎం బువన్ చంద్ర ఎలగందుల సర్పంచ్ నిమ్మల అంజయ్య,పంజాల స్వామి గౌడ్,ఉప సర్పంచ్ గసికంటి కుమార్, అరె మల్లేశం,గుండ మల్లేశం, కాడె ప్రశాంత్,ఆసిఫ్ నగర్ సర్పంచ్ ఆంజనేయులు,ఓరుగంటి చంద్రయ్య,దుర్గం అంజయ్య, దావ ప్రభాకర్, దుర్గం పరశురాం, సిసి లు కరుణాకర్,ప్రియదర్శిని మరియు రైతులు పాల్గొన్నారు.