Take a fresh look at your lifestyle.

శ్రీ భక్తాంజనేయ స్వామి 14వ వార్షిక బ్రహ్మోత్సవాలు.

ముద్ర ,మోత్కూరు:

మోత్కూర్ మండలంలోని రాగిబావి గ్రామములో గల శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయం 14వ వార్షిక బ్రహ్మోత్సవ వేడుకను మంగళవారం పురోహితులు భాస్కరభట్ల శివానంద శర్మ, ఆలయ ప్రతినిధి పసునూరి చంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా మంగళ వాయిద్యాలు మామిడి తోరణాలతో గుడిని అలంకరించి అనంతరం గణపతి పూజ, స్వస్తివాచనం, ఆంజనేయ స్వామికి సింధూరం అలంకరించారు. అనంతరం గణపతి, నవగ్రహాల, మృత్యుంజయ, రుద్ర హనుమాన్, గాయత్రీ రామ, దుర్గా హోమాలు, పూర్ణాహుతి, శిఖర పూజ, గుడి ప్రదక్షణం, మంగళహారతులను ఘనంగా నిర్వహించారు. అనంతరం భక్తులకుతీర్థప్రసాదాలను పంచిపెట్టారు. మహా అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం సాయంత్రం పెద్ద సంఖ్యలో భక్తి శ్రద్ధలతో బొడ్రాయికి బోనాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మెండు శ్రీవాణి చంద్రశేఖర్ రెడ్డి, ఏసిపి కడారు వెంకటరెడ్డి, ఉప సర్పంచ్ పానుగుళ్ల లక్ష్మీ రమేష్, వార్డు మెంబర్లు, పులగం దామోదర్ రెడ్డి, ఎన్నంశ్రీనివాస్ రెడ్డి, పెసరు సోమిరెడ్డి, కక్కిరేణి చంద్రయ్య, పానుగుల్ల విష్ణు, రాంపాక నర్సింగరావు, పసునూరి నర్సిరెడ్డి, బిల్ల రాంరెడ్డి, గ్రామ ప్రజలు భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.