మహిళలు సావిత్రిబాయి పూలేని ఆదర్శంగా తీసుకోవాలి: మున్సిపల్ చైర్ పర్సన్ తంగళ్ళపల్లి శ్రీవాణి రవికుమార్
ముద్ర, ప్రతినిధి భువనగిరి :
నేటి మహిళలు సావిత్రిబాయి పూలేని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని భువనగిరి మున్సిపల్ చైర్ పర్సన్ తంగళ్ళపల్లి శ్రీవాణి రవికుమార్ పిలుపునిచ్చారు. మంగళవారం చదువులతల్లి భారతదేశపు మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా భువనగిరి విద్యుత్ శాఖ కార్యాలయం ఆవరణలో గల మహాత్మ సావిత్రిబాయి పూలే జ్యోతిరావు పూలే మహనీయుల విగ్రహాలకు పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్బంగా చైర్మన్ మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే మూడు నమ్మకాలు రూపుమాపడం కోసం స్త్రీల విద్య కోసం జీవితాంతం పోరాడి తన జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప మహోన్నత వ్యక్తిని తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ నాగు, పోలిశెట్టి అనిల్, సరగడ అమర్, ఎస్ఏఓ హరీష్ కుమార్, విద్యుత్ బిసి ఉద్యోగులు బొబ్బిలి మురళి, రేసు శ్రీనివాస్, ఎస్ సిద్ధి లింగం, ర్యాకల బాల నరసింహ, బత్తిని కిరణ్ కుమార్ పాల్గొన్నారు.