ముద్ర ప్రతినిధి, సిద్దిపేట :
హైదరాబాదులోని హకింపేటలో ఈనెల 27 నుండి నాలుగు రోజులపాటు జరిగే రాష్ట్రస్థాయి స్పోర్ట్స్ స్కూల్ ప్రవేశాలకు సిద్దిపేట విద్యార్థులు 20 మంది ఎంపికైనట్లు జిల్లా యువజన క్రీడల అభివృద్ధి అధికారి జంగపల్లి వెంకట నరసయ్య ఒక ప్రకటనలో తెలిపారు.. సిద్దిపేట జిల్లా కేంద్రంలో గత నెల 31న నిర్వహించిన జిల్లా స్థాయి స్పోర్ట్స్ స్కూల్ ప్రవేశాల ఎంపిక పోటీలలో అత్యంత ప్రతిభ కనబరిచిన వారిని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు ఆయన పేర్కొన్నారు. జిల్లావ్యాప్తంగా నూట పదిమందికి గాను 86 మంది విద్యార్థులు హాజరై, బ్యాటరీ టెస్టుల్లో చూపిన ప్రతిభ ఆధారంగా పదిమంది బాలికలు, పదిమంది బాలురు ఎంపిక చేసినట్లు ఆయన పేర్కొన్నారు… ఎంపికైన వారిలో బాలికల విభాగం నుండి ఆడేపురిషిక(సిద్దిపేట అర్బన్), మట్టల షణ్ముఖ రాయి, (హుస్నాబాద్) దూలిమిట్టహరిణి( చిన్నకోడూరు), దుబ్బాక అన్విశ్రీ పటేల్(హుస్నాబాద్), లింగాల అభిజ్ఞా రెడ్డి(సిద్దిపేట రూరల్),సానియా హబ్సిన్(హుస్నాబాద్), గడవేరుగు ఆద్యశ్రీ(అక్బర్ భూంపల్లి), రెడ్డి రేణుక(సిద్దిపేట రూరల్), కొమ్మడి సాత్విక రెడ్డి(సిద్దిపేట రూరల్),ఎంపికవ్వగా, బాలుర విభాగం నుండి మంద అక్షయ్ కుమార్ యాదవ్(సిద్దిపేట రూరల్), మల్లం విశ్వవర్ధన్(దూలిమిట్ట), బొజ్జ అభియాన్(అక్కన్నపేట), బానోతు శ్రీ చరణ్(అక్కన్నపేట), బట్ట మహాంష్,(సిద్దిపేట రూరల్)కనకాల రిశ్విత్(నారాయణరావుపేట్), గుత్తికొండ రామేశ్వర్(హుస్నాబాద్), కోర్సా చాణుక్య(మార్కూక్), తిరునగరి తశ్విన్( జగదేవ్పూర్), బొజ్జ అశోక్(హుస్నాబాద్) లు ఎంపికైనట్లు ఆయన పేర్కొన్నారు.. ఎంపికైన పై విద్యార్థులను అభినందిస్తూ రాష్ట్రస్థాయిలో కూడా చక్కటి ప్రతిభ కనబరిచి రాష్ట్రంలోని నాలుగు ప్రాంతీయ క్రీడ పాఠశాలలు హకింపేట, ఆదిలాబాద్, కరీంనగర్, హనుమకొండ కు ఎంపికై జిల్లాకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఆయన కోరారు…