Take a fresh look at your lifestyle.

బీజేపీ కుట్రలను త్రిప్పి కొట్టడానికే యాత్ర

  • రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి తుమ్మల నాగేస్వార రావు.
  • బీజేపీ పాలనకు చరమ గీతం పాడాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపు.

ముద్ర, ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో: కులం, మతం, వర్గం, వర్ణం పేరుతో అల్లర్లు సృష్టించి ప్రజల్లో గందరగోళాన్ని సృష్టిస్తున్న కేంద్ర పాలకుల ఎత్తులను, కుట్రలను తిప్పి కొట్టడానికే కాంగ్రెస్ జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ యాత్రను చేపట్టిందని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు చెప్పారు.గురువారం ఆయన పార్టీ జిల్లా అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ తో కలసి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఖమ్మం నియోజకవర్గ పరిధిలోని ఖమ్మం3వ నగర డివిజన్ కార్పొరేటర్లు, డివిజన్ అద్యక్షులు, ముఖ్యనాయకులతో సమావేశమయ్యారు.ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ దేశంలో బీజేపీ నిరంకుశ పాలనకు చరమ గీతం పాడాల్సిన అవసరం వుందన్నారు.అంబేద్కర్ ఆశయాలను నీరు గారుస్తూ గాంధీ స్ఫూర్తిని దెబ్బ తీసేలా కేంద్రంలో బీజేపీ పాలన సాగుతోందన్నారు.ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు జాతీయ జెండాను చేబూని జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ యాత్రను చేపట్టాలని పిలుపు నిచ్చారు. అంతే కాకుండా, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ది పథకాలను ప్రజలకు వివరించాలని సూచించారు. ఈ సమావేశంలో ఖమ్మంత్రీ టౌన్ కాంగ్రెస్ ఇంచార్జి, బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షులు యర్రం బాలగంగాధర్ తిలక్, కార్పొరేటర్లు కమర్తపు మురళీ,గజ్జల లక్ష్మీ వెంకన్న, కన్నం వైష్ణవి ప్రసన్న, జిల్లా ఐఎన్టీయూసీ అద్యక్షులు కొత్తా సీతారాములు, నగర ఓబీసీ సెల్ అద్యక్షులు బాణాల లక్ష్మణ్, మార్కెట్ కమిటి డైరెక్టర్ బోజెడ్ల సత్యనారాయణ, నాయకులు నల్లపు శ్రీనివాస్, జాకీర్ హుస్సేన్, సాదే శంకర్, యాసబోయిన శ్రీశైలం, బొమ్మ ఉదయ్. లక్కీ. బెజ్జం గంగాధర్ తదితర నాయకులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.