Take a fresh look at your lifestyle.

ఎనర్జీ సప్లై మానిటరింగ్ కమిటీ ఏర్పాటు కలెక్టర్ ప్రతిమా సింగ్

ముద్ర ప్రతినిధి, మెదక్:
జిల్లాలో గ్యాస్ సిలిండర్లు వినియోగదారులకు నిరంతరంగా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవడం కోసం జిల్లా స్థాయి ఎనర్జీ సప్లై మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సూచనల మేరకు కలెక్టర్ అధ్యక్షతన ఈ కమిటీ ఏర్పాటు చేయబడిందని, ఈ కమిటీలో ఎస్పీ, అదనపు కలెక్టర్, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల ప్రాంతీయ మేనేజర్లు, ఆర్‌టీఓ, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి, జిల్లా వ్యవసాయ శాఖాధికారి, జిల్లా విద్యాశాఖాధికారి, బీసీ, ఎస్సీ, ఎస్టీ, సంక్షేమ అధికారులు, ఎల్‌పీజీ డిస్ట్రిబ్యూటర్ల సంఘ ప్రతినిధి సభ్యులుగా ఉంటారని, జిల్లా పౌర సరఫరాల అధికారి కన్వీనర్‌గా వ్యవహరించనున్నట్లు తెలిపారు. జిల్లాలో గ్యాస్ సిలిండర్ల సరఫరా పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించడం, డిస్ట్రిబ్యూటర్ల గోదాముల్లో నిల్వల స్థితిని రోజువారీగా పరిశీలించడం, నిల్వ కేంద్రాలు, పంపిణీ కేంద్రాల వద్ద భద్రతా చర్యలను పటిష్టంగా అమలు చేయడం వంటి చర్యలను కమిటీ పర్యవేక్షణ చేస్తుందని తెలిపారు. అలాగే సిలిండర్ల నిల్వచేయడం, దారి మళ్లింపు, బ్లాక్ మార్కెటింగ్, గృహ వినియోగ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు అక్రమంగా ఉపయోగించడం వంటి చర్యలను నివారించడానికి కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. అవసరమైతే ఎస్సెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు.

Leave A Reply

Your email address will not be published.