Take a fresh look at your lifestyle.

ఇరాన్ లో ఉన్న భారతీయులు అధైర్యపడవద్దు.. : మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్

యోగక్షేమాల సమాచారం కోసం ప్రత్యేక సెల్ ఏర్పాటు చేస్తాం..

మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్..

ముద్ర, ధర్మపురి:

Iran crisis : ఇరాన్ పై ఇజ్రాయిల్ అమెరికా చేస్తున్న దాడుల నేపథ్యంలో ఇరాన్ లో ఉన్న భారతీయులు అధైర్య పడవద్దని మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లా నుండి ఉపాధి కోసం పలువురు ఇరాన్ దేశానికి వలస వెళ్లారని ప్రస్తుతం ఇరాన్ పరిస్థితిని ప్రభుత్వం ఎప్పటికప్పుడు గమనిస్తుందని మంత్రి తెలిపారు.

ఇరాన్ లో ఉన్న భారతీయుల యోగక్షేమాల కోసం రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని కోరినట్లు మంత్రి తెలిపారు. కేంద్ర ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు రాష్ట్ర అధికారులు సమాచారం సేకరిస్తున్నారని మంత్రి తెలిపారు.

ఇరాన్ లో ఉన్న జగిత్యాల జిల్లావాసులు సైతం వారి యోగక్షేమాలను ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి, కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వాలని మంత్రి పిలుపునిచ్చారు. ఇరాన్ లో ఉన్న భారతీయులు ఎవరు ఆందోళన చెందవద్దని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ధైర్యం చెప్పారు.

Leave A Reply

Your email address will not be published.