Take a fresh look at your lifestyle.

ఇంటర్మీడియట్ వ్యవస్థ రద్దు నిర్ణయం విద్యా వ్యవస్థ వ్యతిరేక చర్య… ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి : ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి లావుడియ రాజు

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి :
ఇంటర్మీడియట్ వ్యవస్థ రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని విద్యా వ్యవస్థ వ్యతిరేక చర్య ప్రభుత్వం మీద తన నిర్ణయాన్ని పునసమీక్షించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి లావుడియ రాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు… శనివారం భువనగిరిలోని సుందరయ్య భవనంలో అవైలబుల్ జిల్లా కమిటీ సమావేశం జిల్లా అధ్యక్షులు వేముల నాగరాజు అధ్యక్షతన జరగగా ఆయన హాజరై మాట్లాడుతూ అశాస్త్రీయమైన సంస్కరణల పేరుతో లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును పణంగా పెట్టడం సరికాదన్నారు.
ఉన్నత విద్యకు వారధిగా ఉన్న ఈ రెండేళ్ల విద్యా విధానాన్ని మార్చడం వల్ల విద్యార్థులు గందరగోళానికి గురవుతారని ఇప్పటికే ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మౌలిక సదుపాయాల లేమి, అధ్యాపకుల కొరత వేధిస్తుంటే.. వాటిని పరిష్కరించాల్సింది పోయి, ఏకంగా వ్యవస్థనే రద్దు చేయడం అంటే ప్రభుత్వ విద్యను అణచివేయడమే అన్నారు. ప్రభుత్వం తక్షణమే ఇంటర్మీడియట్ వ్యవస్థ రద్దు ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలి, విద్యా రంగ నిపుణులు, విద్యార్థి సంఘాలతో చర్చించకుండా ఎలాంటి ఏకపక్ష నిర్ణయాలు తీసుకోకూడదు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఖాళీగా ఉన్న లెక్చరర్ పోస్టులను భర్తీ చేసి, నాణ్యమైన విద్యను అందించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థి వ్యతిరేక విధానాలను వీడకపోతే, జిల్లా వ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు హిందురాణి, ధరావత్ జగన్ నాయక్, జిల్లా కమిటీ సభ్యులు నరేందర్, ప్రసన్న పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.