Take a fresh look at your lifestyle.

మిల్లర్లు వెంటనే ధాన్యం దిగుమతులు చేసుకోవాలి : అదనపు కలెక్టర్ వెంకారెడ్డి

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి :
వరిధాన్య కొనుగోళ్లు ముమ్మరం అవుతున్న సందర్బంగా మిల్లర్లు వెంటనే ధాన్యం దిగుమతులు చేసుకోవాలని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకారెడ్డి అన్నారు. శనివారం ఆయన చాంబర్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ సరిపడా హమాలీలను పెంచుకోవాలని వెంటనే షిఫ్ట్ ల వారిగా
దిగుమతులు వెంటనే జరిగేలా చూడాలన్నారు. మిల్లర్ల అక్నౌలెడ్జిమెంట్ పూర్తి చేయగలరని రైస్ మిల్లర్లకు ఆదేశించారు. ఎన్ఫోరసెమెంట్ స్టాఫ్ రైస్ మిల్లుల వద్ద ధాన్యం దిగుమతి అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్ లకు పీపీసీ సెంటర్ లో అదనంగా లారీలు పెట్టమని ఆదేశాలిచ్చారు. ఈ సమావేశం లో డి సి ఎస్ ఓ, డి ఎం సి ఎస్, ఆర్టీవో, డిటిసిఎస్ లు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.