ముద్ర ప్రతినిధి, నిర్మల్:
వివిధ కేసులతో ఇబ్బంది పడుతున్నవారు ఈ నెల 28 న జరిగే జాతీయ లోక్ అదాలత్ ను వినియోగించుకోవాలని ఎస్పీ జానకి షర్మిల ఒక ప్రకటనలో కోరారు. తమ కేసులను త్వరితగతిన తక్కువ ఖ
వ్యయంతో పరిష్కరించేందుకు భారత ప్రభుత్వం నిర్వహిస్తున్న జాతీయ లోక్ అదాలత్ కక్షిదారులకు ఎంతో ఉపయోగపడుతుందని ఆమె పేర్కొన్నారు. చిన్న చిన్న కేసులు, ట్రాఫిక్ చలానాలు, మైనర్ క్రిమినల్ కేసులు, సివిల్ వ్యాజ్యాలకు లోక్ అదాలత్ ద్వారా సులభంగా పరిష్కారం పొందవచ్చని తెలిపారు. ఇందువల్ల న్యాయ స్థానాల్లో పెండింగ్‌లో ఉన్న కేసులను తక్కువ సమయంలో ముగించు కోవచ్చన్నారు.