ముద్ర ప్రతినిధి, నిర్మల్:
నిర్మల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అడ్మిషన్ల కోసం రూపొందించిన పోస్టర్ ను అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు ఆవిష్కరించారు.కళాశాలలో అడ్మిషన్లు దోస్త్ ద్వారా జరుగుతాయని ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన విద్యార్థినీ విద్యార్థులు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చేరాలని ఆయన సూచించారు. ప్రభుత్వ కళాశాలలోనే నాణ్యమైన విద్య అందుతుందని అన్నారు. దోస్త్ మొదటి విడత 15 న ప్రారంభమైందని, ఇది7 మే వరకు ఉంటుందని తెలిపారు. ఈ లోపు విద్యార్థులు తమ సర్టిఫికెట్లతో కళాశాలలో సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సుధాకర్, అధ్యాపకులు డాక్టర్ గంగాధర్, శ్రీహరి, డాక్టర్ పి జి రెడ్డి, రమేష్, సుభాష్, అర్చన, రజిత లు పాల్గొన్నారు